
ముంబై: మరో విజయం సాధిస్తే హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ప్రాంజల 6–3, 6–0తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది.
ఒక్సానా (జార్జియా)తో నేడు జరిగే రెండో రౌండ్‌లో గెలిస్తే ప్రాంజల మెయిన్ ‘డ్రా’కు అర్హత పొం దుతుంది. క్వాలిఫయింగ్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌజన్య భవిశెట్టి 3–6, 1–6తో హిరోకో కువాటా (జపాన్) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment