
న్యూఢిల్లీ: వరుసగా రెండు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టోర్నమెంట్ టైటిల్స్ గెలిచిన హైదరాబాద్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల ర్యాంకింగ్స్‌లో అద్భుత పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 60 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 280వ ర్యాంక్‌కు చేరుకుంది.
అంకిత రైనా 195వ స్థానంలో నిలిచి భారత మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా ఉంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ టాప్–100లో స్థానం కోల్పోయాడు. యూరోపియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన యూకీ బాంబ్రీ ఏడు స్థానాలు కోల్పోయి 107వ ర్యాంకులో నిలిచాడు. నింగ్బో చాలెంజర్ టోర్నీలో రాణించిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ 146వ ర్యాంక్‌ను అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment