
ముంబై: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల–కర్మన్‌కౌర్ థండి (భారత్) జోడీ 4–6, 2–6తో దలీలా జకుపోవిచ్ (స్లొవేనియా)–ఇరీనా ఖరోమచెవా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత ఆశాకిరణం అంకిత రైనా 6–2, 6–2తో పియెంగ్‌టర్న్ ప్లిపుయెచ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. తద్వారా తన కెరీర్‌లో తొలిసారి ఓ డబ్ల్యూటీఏ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అమన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)తో అంకిత ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment