ప్రాంజల శుభారంభం | good start for pranjala | Sakshi
Sakshi News home page

ప్రాంజల శుభారంభం

Published Sun, Jan 25 2015 12:36 AM | Last Updated on Fri, Sep 7 2018 1:59 PM

ప్రాంజల శుభారంభం - Sakshi

ప్రాంజల శుభారంభం

జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ప్రాంజల 6-4, 6-3తో కేటీ పొలూటా (దక్షిణాఫ్రికా)పై గెలిచింది. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రెండో రౌండ్‌లో టాప్ సీడ్ షిలిన్ జు (చైనా)తో ప్రాంజల తలపడుతుంది.

మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన ఓజస్విని సింగ్ 6-0, 4-6, 1-6తో ఒలివియా హాగర్ (అమెరికా) చేతిలో ఓడిపోగా... బాలుర సింగిల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ నాగల్ (భారత్) 6-2, 4-6, 6-4తో ఐదో సీడ్ మైకేల్ మో (అమెరికా)పై సంచలన విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-జర్మీలా గజ్దోసోవా (ఆస్ట్రేలియా) జంట 6-4, 6-7 (7/9), 8-10తో హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement