క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి | pranjala couple in qurtars | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి

Published Thu, Mar 19 2015 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి

క్వార్టర్స్‌లో ప్రాంజల జోడి

సాక్షి, హైదరాబద్: తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ గ్రేడ్-1 జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దూసుకెళ్తోంది. మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హైదరాబాద్ క్రీడాకారిణికి తొలి రౌండ్ రెండు విభాగాల్లోనూ బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్ బరిలోకి దిగింది. సింగిల్స్‌లో మూడో సీడ్ ప్రాంజల 6-1, 6-2తో గాబ్రియెల్లా డా సిల్వాఫిక్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించింది. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నూర్ హలిజా (ఇండోనేసియా)తో కలిసి రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రాంజల జోడి 6-2, 6-3తో ఇగ్లుపాస్ ఖిమ్ (ఫిలిప్పీన్స్)-కహ్‌ఫియాని రిఫాంటి (ఇండోనేసియా) జంటపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement