
కైరో: పురావస్తు శాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఫొటోగ్రాఫర్, మోడల్‌ను ఈజిప్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్కియాలజీ జోన్‌లో ప్రైవేట్ ఫొటోషూట్ నిర్వహించినందుకు వారిని అరెస్టు చేశారు. మోడల్- డాన్సర్ సల్మా అల్-షిమీ 4700 వందల ఏళ్లనాటి చరిత్ర గల జోసర్ పిరమిడ్ ప్రాంగణంలో ఈజిప్షియన్ల పూర్వకాలం నాటి వస్త్రధారణను తలపించేలా దుస్తులు ధరించి ఫొటోలు దిగారు. వారం రోజుల కిత్రం తన ఇన్‌స్టా అకౌంట్‌లో వీటిని షేర్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో తొలుత ఫొటోగ్రాఫర్‌ను, ఆ తర్వాత షిమీని కూడా అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. (చదవండి: 2,500 ఏళ్ల తరువాత 'మమ్మీ'ని బయటకు తీశారు)
ఈజిప్షియన్ల సంప్రదాయాలను అగౌరవపరిచినందుకు వీరిపై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఆర్కియాలజీ జోన్‌లో ఫొటోలు తీసుకోవడంపై నిజంగానే నిషేధం ఉందా? లేదా ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా’’అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారంటూ సోషల్ మీడియా ఇన్ల్ఫూయర్స్‌పై ఈజిప్టు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. (చదవండి: టిక్‌టాక్: కటకటాల వెనక్కు బెల్లీ డ్యాన్సర్)
Comments
Please login to add a commentAdd a comment