చర్చి వద్ద బాంబు పేలుడు, 25 మంది మృతి
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో ఆదివారం ఓ చర్చి వద్ద సంభవించిన బాంబు పేలుడులో కనీసం 25 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డారు. కైరోలోనే బాంబు దాడిలో ఆరుగురు పోలీసులు మరణించిన రెండు రోజుల తర్వాత ఈ దాడి జరిగింది.
చర్చి గోడ బయటనుంచి ఓ దుండగుడు బాంబు విసిరాడని స్థానిక మీడియా పేర్కొంది. కాగా చర్చి ఆవరణలో అమర్చిన బాంబును పేల్చి ఈ దారుణానికి పాల్పడ్డారని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బాంబు పేలుడు తర్వాత ఆ ప్రాంతం రక్తసిక్తంగా మారింది. మృతుల్లో మహిళలు ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఈజిప్టులో క‍్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు తరచూ దాడులు చేస్తున్నారు.