వాహనాన్ని ఢీకొన్న రైలు: 8 మంది మృతి | 8 killed after train collides with passenger vehicle in Egypt | Sakshi
Sakshi News home page

వాహనాన్ని ఢీకొన్న రైలు: 8 మంది మృతి

Published Sat, Apr 16 2016 8:24 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

8 killed after train collides with passenger vehicle in Egypt

కైరో : ఈజిప్టులో ప్రయాణికులను తీసుకువెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. మరో ఏనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి గురువారం ఈజిప్టులో వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.

వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రైలు అశ్వన్ నుంచి ఈజిప్టు రాజధాని కైరో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. ప్రపంచంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న టాప్ 10 దేశాల్లో జాబితాలో ఈజిప్టు చోటు సంపాదించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement