సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. అలెప్పొ రాష్ట్రంలోని అల్ బాబ్ నగరంపై ఆదివారం హెలీకాప్టర్లతో దాడులు చేశారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్టు సిరిమా మానవ హక్కుల వేదిక వెల్లడించింది.
తిరుగుబాటు దారులను అణిచేందుకు సిరియా సైన్యం దాడి చేసింది. అధ్యక్షుడు బషర్ అల్ అసాద్కు చెందిన హెలీకాప్టర్లతో పేలుడు పదార్థాలను నింపిన బారెల్స్ను నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. అల్ బాబ్ నగరంలోనే శనివారం సిరియా సైన్యం జరిపిన దాడుల్లో మరో 20 మంది చనిపోయారు. తిరుగుబాటు దారులు, సైన్యం మధ్య తరచూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.
సిరియాలో వైమానిక దాడులు; 20 మంది మృతి
Published Mon, Dec 2 2013 8:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement