ట్రక్, మినీ బస్సు ఢీ: 15 మంది మృతి | 15 killed in Egypt truck-bus collision | Sakshi
Sakshi News home page

ట్రక్, మినీ బస్సు ఢీ: 15 మంది మృతి

Published Sun, Sep 29 2013 8:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM

15 killed in Egypt truck-bus collision

ఈజిప్టులోని ఇస్మాలియా ప్రాంతంలో ఓ ట్రక్, మినీ బస్సు ఢీ కొన్న ఘటనలో 15 మంది మరణించారని స్థానిక మీడియా ఆదివారం ఇక్కడ వెల్లడించింది. మృతుల్లో 11 మందిని గుర్తించినట్లు తెలిపింది. నిన్న చోటు చేసుకున్న ఆ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయపడ్డారని, అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పింది. ఈజిప్టులో ప్రతి ఏడాది వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తారని ఆ మీడియా వివరించింది. జాతీయ రహదారుల నిర్వహాణ, నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనలు ఈజిప్టు దేశంలో నిత్యకృత్యమని స్థానిక మీడియా తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement