Dozens Killed and Injured in Cairo Fire Accident - Sakshi
Sakshi News home page

Cairo Fire Accident: ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం!

Published Sun, Aug 14 2022 5:08 PM | Last Updated on Sun, Aug 14 2022 5:31 PM

Dozens killed and Injured in Cairo Fire Accident - Sakshi

కైరో:  ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ చర్చిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 41 మంది సజీవ దహనం అయ్యారు. ఇంబాబా ఏరియాలోని అబు సీఫెన్‌ చర్చిలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్చిలో ఒక్కసారిగా మంటలు చోటు చేసుకున్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించినట్లు పోలీసులు పాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని 30 అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement