ఈజిప్టులో మరోసారి భారీ హింస చెలరేగింది.
కైరో: ఈజిప్టులో మరోసారి భారీ హింస చెలరేగింది. 2011లో ఈజిప్టు నియంత హోస్నీ ముబాకర్ను పదవీచ్యుతుడిని చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీలు రక్తసిక్తంగా మారాయి. దాదాపు 50 మంది మరణించగా, వందలాదిమంది గాయపడ్డారు.
మిలటరీ మద్దతుతో కొనసాగుతున్న ప్రస్తుత ప్రభుత్వం మద్దతుదారులు, వ్యతిరేకులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. కాగా పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఆ దేశ రాజధాని కైరో, అలెగ్జాండ్రియాలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు అల్లర్లు జరిగాయి. పోలీసులు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కారుల్ని అరెస్ట్ చేశారు. ముబాకర్ను పదవీచ్యుతుణ్ని చేశాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని గతేడాది జూలైలో మిలటరీ గద్దెదించింది.