జైల్లోంచి విడుదల కానున్న ముబారక్!
కైరో: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ త్వరలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయన పదవీచ్యుతుడైన తర్వాత నమోదైన ఈ అవినీతి కేసు విచారణ సరిగా జరగలేదని గుర్తించిన ఆ దేశ ఉన్నత న్యాయస్థానం... దానిపై పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ఈజిప్టును మూడు దశాబ్దాల పాటు పాలించిన నియంత హోస్నీ ముబారక్ తన పాలనా సమయంలో దాదాపు రూ. 90 కోట్ల ప్రభుత్వ నిధులను తన అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలపై గత మేలో మూడేళ్ల కారాగార శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసు పునర్విచారణ నేపథ్యంలో ముబారక్ శనివారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.