ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో నగరంలోని గాడియం స్కూల్ విద్యార్థి అయిన నిష్కా టేబుల్ వాల్ట్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.
కోచ్ మనోజ్ రాణా వద్ద శిక్షణ తీసుకుంటున్న నిష్కా గత ఏడాది కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ జూనియర్ పోటీల్లోనూ పసిడి పతకం గెలిచింది.
సిఫ్ట్ కౌర్‌కు ఐదో స్థానం
బకూ: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా ఐదో స్థానంలో నిలిచి ంది. దాంతో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లభించింది. ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 429.1 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment