చంద్రుడిపై మరిన్ని అగాథాలు
వాషింగ్టన్: చందమామపై మరో రెండు అగాథాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మొదటి దాని వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌరవ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ల్యాంప్, ఎల్‌ఆర్‌ఓ అనే ప్రాజెక్టుల్లో భాగంగా చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ అగాథాలపై కాంతి పడకపోవడంతో వీటిపై అధ్యయనం క్లిష్టతరంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై చిన్న చిన్న రాళ్లు, దుమ్ము కనిపించాయి.