craters
-
Chandrayaan-3: రోవర్కు తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్ నుంచి విడుదలైన రోవర్ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది. రోవర్ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. రోవర్ తప్పించుకున్న బిలం ఇదే.. దారిమళ్లిన రోవర్ గుర్తులు -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
దేవుడు సృష్టించిన వింతా?
-
చంద్రుడిపై మరిన్ని అగాథాలు
వాషింగ్టన్: చందమామపై మరో రెండు అగాథాలను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. మొదటి దాని వయస్సు 1.6 కోట్ల సంవత్సరాలు, రెండోదాని వయసు 7.5 కోట్ల సంవత్సరాలని నిర్ధారించారు. వీటిని కనుగొనడం వల్ల సౌరవ్యవస్థలో రాపిడుల గురించి మరిన్ని పరిశోధనలు నిర్వహించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాంప్, ఎల్ఆర్ఓ అనే ప్రాజెక్టుల్లో భాగంగా చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయం వెల్లడయింది. అయితే ఈ అగాథాలపై కాంతి పడకపోవడంతో వీటిపై అధ్యయనం క్లిష్టతరంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిపై చిన్న చిన్న రాళ్లు, దుమ్ము కనిపించాయి.