సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు.
వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు.
అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
(చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే)
Comments
Please login to add a commentAdd a comment