![woman shocked discovered secret room - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/10/secret-house.gif.webp?itok=5YV0ZClU)
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్‌టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్‌హౌస్‌లోని ఫ్లోర్‌బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది.
దశాబ్ధాల తరబడి రహస్యంగా..
జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్‌లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్‌మెంట్‌ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది.
గది తెరుచుకున్నా..
మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది.
గతంలోనూ బయల్పడిన భూగృహాలు
ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్‌లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment