
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తరుపున వచ్చిన రిలీఫ్ ఫండ్‌ను వెనక్కి ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాల పర్యటనలో భాగం సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని బడేటివారిపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికురాలు వరమ్మ అనే మహిళ ఆ కార్యక్రమానికి హాజరైంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి తనకు వచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ చంద్రబాబుకు వెనక్కి ఇచ్చేసింది. దీంతో సీఎంకు అందరి మందు షాక్ కొట్టినంత పనైంది.
Comments
Please login to add a commentAdd a comment