
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులతో విరుచుకుపడింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకొచ్చాయి. దీంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర ప్రతిదాడులు చేస్తోంది. శనివారం దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గతేడాది నవంబరులో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తొలిసారి పెద్దఎత్తున పరస్పర దాడులు జరుగుతున్నాయి.
బుధవారం.. గాజాపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులకు పాల్పడింది. దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా కనీసం 110 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు. సరిహద్దులకు సమీపంలోని ఖాన్‌యూనిస్ నగర వెలుపల అబసన్ అల్– కబీర్ గ్రామంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 16 మంది చనిపోయినట్లు అక్కడున్న యూరోపియన్ ఆస్పత్రి తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం గాజాపై జరిపిన దాడుల్లో కనీసం 400 మంది చనిపోవడం తెలిసిందే. మంగళవారం నుంచి గురువారం వరకు జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 200 మంది చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 909 మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. కాగా, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment