టాస్మానియా : పక్షులకు ఎగరడం, చేపలకు ఈదడం ఎవరైనా నేర్పుతారా? అయితే పక్షుల్లో అన్నిరకాల పక్షులూ ఎగరలేవనే విషయం మనకు తెలిసిందే. మరి చేపల్లో ఈదడం రాని చేపగురించి ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న చేపను ఓసారి చూడండి.. నిజంగానే ఈ చేపకు ఈదడం రాదు. మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటుంది. అలాగని ఇది చేపజాతి కాదని చెప్పలేం.
ఈ విషయమై శాస్త్రవేత్త డాక్టర్ లిమ్ లిండ్ మాట్లాడుతూ.. ‘కోళ్లు కూడా పక్షులే. అయినా అవి ఎక్కువ దూరం ఎగరలేవు, ఎక్కువ ఎత్తుకూ ఎగరలేవు. అలాగే ఇవి కూడా ఓ రకం చేపలే అయినా వీటికి ఈదడం రాదు.
అందుకే ఇవి ఎక్కువగా కదలవు. అలా ఓచోట కూర్చొని ఉన్నట్లుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. 1980కు ముందు టాస్మానియా ఆగ్నేయ తీరప్రాంతంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడేవి. కానీ
రానురాను వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు అరుదుగా, చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి... ఈ నడిచే చేపల జాతిని రక్షించే దిశగా పరిశోధనలు
చేస్తున్నార’ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment