కోపెన్‌హాగన్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ కొత్తరకం జీవి ఫొటో వైరల్ అవుతోంది. ఇది పరాన్న జీవి ఫంగస్‌లోని కొత్త రకం జీవిగా.. దీని పేరు ‘ట్రోగ్లోమైసెస్’ అని సోఫియా రెబొలైరా అనే జీవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓ పత్రికలో పేర్కొన్నారు. కోపెన్‌హాగన్ యూనివర్శిటీకి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్‌లో జీవశాస్త్రవేత్త విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్‌గా పని చేస్తున్న సోఫియా రెబొలైరా ట్విటర్‌లో కనుగొన్న ఆ జీవికి ఆ పేరు వచ్చేలా ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని నామకరణం చేశారు.
ఈ ఫొటోను వర్జీనియా టెక్‌లోని ప్రస్తుతం పీహెచ్‌డీ విద్యార్థిని కీటక శాస్త్రవేత్త డెరెక్ హెన్నెన్ 2018లో పోస్టు చేసినట్లు ఆమె తెలిపారు. రెబొలైరా ‘దీనిని పరీక్షించి చూస్తే దానిపై కొన్ని చిన్న రంధ్రాలతో కూడిన ఫంగస్‌ను చూశాను. దాని ఉపరితలంపై శిలీంధ్రాల మాదిరి ఉండటం గమనించాను. అయితే ఇంతవరకు ఈ పరాన్న జీవిని అమెరికన్ మిల్లిపేడ్స్‌లో ఇంతవరకు చూడలేదు’ అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రకం ఫంగస్‌కు సంబంధించిన వివరాలు ఇది వరకు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో పారిస్‌కు చెందిన ఓ నేచురల్ హిస్టరీ మ్యూజియం.. రెబొలైరా కొత్త జీవిని కనుగొన్నట్లు ధ్రువీకరించింది. ట్విటర్‌లో కనుగొన్న కారణంగా దానికి ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని పేరుపెట్టారు. ఈ ట్విట్టరీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల కిత్రం బహుపాది మీద ఓ ఫంగీని పోలిన జీవులు ఉండటం చూశాను. అప్పటివరకు ఈ ఫంగి అమెరికన్ బహుపాదుల మీద కనిపించలేద’ని ఆమె చెప్పారు.
ఇది ఎలా ఉంటుంది: ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్
ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ లాబౌల్బెనియల్స్ అనే ఆర్డర్‌కు చెందినది. ఇది కీటకాలు, మిల్లిపెడెస్‌పై దాడి చేసే చిన్న శిలీంధ్రపు పరాన్నజీవులు. ఇవి అతి చిన్న లార్వాలా ఉండి.. పునరుత్పత్తి అవయవాలనైనా హోస్ట్ జీవుల వెలుపల నివసిస్తాయి. లాబౌల్బెనియల్స్ మొట్టమొదట 19వ శతాబ్దం మధ్యలో కనుగొనబడ్డాయి.1890 నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రోలాండ్ థాక్స్టర్ చేసిన వివరణాత్మక అధ్యయనం పుస్తకంలో వాటి వర్గీకరణ స్థానం గుర్తించబడింది. ఈ శిలీధ్రాలలో సుమారు 1260 జాతులు ఉంటాయని థాక్స్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment