ఫొటోలో వింత పువ్వులా కనిపిస్తున్నది నిజానికి పువ్వు కాదు, పుట్టగొడుగు. చూడటానికి నక్షత్రాకారంలో కనిపించడం వల్ల దీనిని ‘రౌండెడ్ ఎర్త్‌స్టార్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘గీస్ట్రమ్ సాకేటమ్’. ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా ఎండకు ఎండి, వానకు నాని పుచ్చిపోతున్న కలప దుంగలపై వేసవి చివరి భాగంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. హవాయి పొడి అడవుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి.
అమెరికా, కెనడా, చైనా, ఉరుగ్వే, కాంగో, క్యూబా, మెక్సికో, పనామా, దక్షిణాఫ్రికా, టాంజానియా, టొబాగో, భారత దేశాలలో కొంత అరుదుగా కనిపిస్తాయి. పుచ్చిపోయే దశలో ఉన్న కలప దుంగల్లోని క్యాల్షియంను ఆహారంగా చేసుకుని ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి మాసిపోయిన తెలుపు, లేతగోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు వివిధ ఛాయల్లో కనిపిస్తాయి.అయితే, ఇవి తినడానికి పనికిరావు.
Comments
Please login to add a commentAdd a comment