Something Special
-
సమ్‌థింగ్ స్పెషల్: గాల్లో ఎగిరొచ్చి పరీక్ష, ఇది కారా, బైకా?
‘ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వెళతారు?’ అనే ప్రశ్నకు జవాబు తెలియనిదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. ‘మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుంది’ అని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డుమీద వెళ్లకుండా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం... పారాగ్లైడ్!ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ్ చిన్న జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. పరీక్ష కేంద్రం అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది, సమయం ఇంకా ఇరవై నిమిషాలు మాత్రమే ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా అక్కడికి సకాలంలో చేరుకోవడం అసాధ్యం అనుకున్న సమర్థ్ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నాడు. పారాగ్లైడింగ్ గేర్ ధరించిన సమర్థ్ గాలిలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకున్నాడు. ఇందు కోసం అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ గోవింద్ యెవాలే సహాయం తీసుకున్నాడు. తన బృందం సహాయంతో సమర్థ్‌కు అన్నిరకాల ఏర్పాట్లు చేసి తోడ్పాటు అందించాడు గోవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A Panchgani student paraglided 15 km to make it to his exam on time as the traffic was very high on the roads. 100 marks for creative problem solving! #ExamHacks #OnlyInIndia pic.twitter.com/YzFYKRWnSx— Harsh Goenka (@hvgoenka) February 17, 2025బైక్+కారు= బైకార్ కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌కు సంబంధించి హోమ్మేడ్ టెస్లా సైబర్ ట్రక్ రెప్లికా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే... సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక పాకిస్థానీ వ్యక్తి విచిత్రమైన, ఆకర్షణీయమైన హైబ్రీడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము. అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు, సగం బైక్ ‘కళ’యిక ఈ వాహనం!వాహనం ముందుభాగంలో మోటర్ సైకిల్ హ్యాండిల్ బార్, వీల్ కనిపిస్తాయి. ‘వోన్లీ ఇన్ పాకిస్థాన్’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను చూసి ‘అయ్ బాబోయ్’ అంటున్నారు నెటిజనులు. కొందరు ఈ విచిత్ర వాహనాన్ని సల్మాన్‌ఖాన్ ‘కిక్’ సినిమాలో ఉపయోగించిన వాహనంతో పోల్చారు. ‘కిక్ సినిమాతో ఇన్స్పైర్ అయ్యి ఈ బైక్ ప్లస్ కారును తయారు చేశారు’ అని రాశారు. ఈ వీడియో మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం మాట ఎలా ఉన్నా.... ‘సరదాలు, ప్రయోగాల సంగతి సరే... రోడ్ సేఫ్టీ మాటేమిటి’ అని ఘాటుగా ప్రశ్నించారు కొందరు. నిజమే కదా! -
నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!
ఫొటోలో వింత పువ్వులా కనిపిస్తున్నది నిజానికి పువ్వు కాదు, పుట్టగొడుగు. చూడటానికి నక్షత్రాకారంలో కనిపించడం వల్ల దీనిని ‘రౌండెడ్ ఎర్త్స్టార్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘గీస్ట్రమ్ సాకేటమ్’. ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా ఎండకు ఎండి, వానకు నాని పుచ్చిపోతున్న కలప దుంగలపై వేసవి చివరి భాగంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. హవాయి పొడి అడవుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. అమెరికా, కెనడా, చైనా, ఉరుగ్వే, కాంగో, క్యూబా, మెక్సికో, పనామా, దక్షిణాఫ్రికా, టాంజానియా, టొబాగో, భారత దేశాలలో కొంత అరుదుగా కనిపిస్తాయి. పుచ్చిపోయే దశలో ఉన్న కలప దుంగల్లోని క్యాల్షియంను ఆహారంగా చేసుకుని ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి మాసిపోయిన తెలుపు, లేతగోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు వివిధ ఛాయల్లో కనిపిస్తాయి.అయితే, ఇవి తినడానికి పనికిరావు. -
కట్టినోళ్ల కష్టం గుర్తుండేలా!
సాక్షి, అమరావతి: తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్లు ఎవరికీ తెలియదు. కానీ.. తన కలల సౌధాన్ని నిర్మించిన శ్రామికుల వివరాలన్నీ ఆ యజమానికి తెలుసు. వారి పేర్లు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా శిలాఫలకంపై చెక్కించాడు ఆ అపార్ట్మెంట్ యజమాని కొత్తపల్లి మురళీమోహనరావు (అబ్బులు). ఆయన విలక్షణ శైలి గురించి తెలిసినోళ్లంతా ‘వావ్.. సమ్‌థింగ్ స్పెషల్ అబ్బులు’ అంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో 2012లో నిర్మించిన ఐదంతస్తుల ‘అలిపిరి అపార్ట్స్’లోకి వెళ్లగానే సెల్లార్లో నిలువెత్తు శిలాఫలకం కనిపిస్తుంది. అందులో ఆ భవన నిర్మాణం కోసం శ్రమించిన తాపీమేస్త్రి, ప్లంబర్, కరెంటు వర్కర్, పెయింటర్, ఐరన్ మేస్త్రి, టైల్స్ మేస్త్రి, వాచ్‌మేన్ పేర్లు, వారి ఊరు, ఫోన్ నంబర్లు ఆ శిలాఫలకంపై దర్శనమిస్తాయి. ఆ అపార్ట్మెంట్ గృహప్రవేశం జరిగి ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యింది. శ్రామికుల పేర్లతో అమర్చిన శిలాఫలకాన్ని చూసిన ప్రతి ఒక్కరు అబ్బురపడుతున్నారు. శ్రామికులకు గుర్తించిన అబ్బులును అభినందిస్తున్నారు. వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతికి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికల్లో గెలిస్తే తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కుకున్న అబ్బులు అప్పట్లోనే మొక్కు చెల్లించుకున్నారు. తణుకు నుంచి పాదయాత్ర చేపట్టి ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి తిరుమల తిరుపతి వెళ్లారు. 15 రోజుల పాదయాత్ర చేసి 2004 ఆగస్టు 5న తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. దారి పొడవునా జోలెపట్టి ప్రజల నుంచి సేకరించిన రూ.32 వేల విరాళంలో రూ.16 వేలు తిరుపతి వెంకటేశ్వరుడి హుండీలోను, మరో రూ.16 వేలు తణుకులోని నాలుగు ఆలయాల్లోను సమర్పించి దేవుడిపైన, ఇటు వైఎస్‌పైన తన భక్తిని చాటుకున్నాడు. శ్రామికుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకం పురాతన నాణేల సేకరణ అబ్బులుకు పురాతన నాణేలు సేకరించే మరో హాబీ కూడా ఉంది. కాలక్రమంలో కనుమరుగైన అనేక నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. కాణీలు, అణాలు, పైసలు వంటివి సేకరించడం గమనార్హం. సంతృప్తినిచ్చే పనులు చేస్తాను విలక్షణంగా ఆలోచించి అమలు చేయడం సంతృప్తినిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రముఖుల పేర్లతో శిలాఫలకాలు వేస్తారు. అలాకాకుండా శ్రామికుల పేర్లు శిలాఫలకంపై వేస్తే వారికెంతో సంతృప్తిగా ఉంటుంది. అందుకే నా భవన నిర్మాణంలో శ్రమించిన వారి పేర్లతో శిలాఫలకం వేయించాను. అది చూసి వారి ముఖంలో అప్పట్లో కనిపించిన ఆనందం.. పదేళ్లయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. నాకు వైఎస్ అంటే చాలా ఇష్టం. 2004లో వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతి వెళ్లాను. కనుమరుగవుతున్న పురాతన నాణేలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో వాటి సేకరణను హాబీగా పెట్టుకున్నాను. – కొత్తపల్లి మురళీ మోహనరావు (అబ్బులు), తణుకు -
బతికి ఉండగానే ‘అంత్యక్రియలు’!!
సియోల్ : జీవిత పరమార్థాన్ని తెలిపేందుకు, బతుకు మీద తీపిని పెంచేందుకు దక్షిణ కొరియా హీలింగ్ సెంటర్లు సరికొత్త విధానాలు అనుసరిస్తున్నాయి. ప్రాణాలతో ఉండగానే ‘సామూహిక అంత్యక్రియలు’ నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నాయి. తద్వారా నిరాశలో కూరుకుపోయిన వారు జీవితాన్ని కొత్త కోణం నుంచి చూసేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెలువరించిన నివేదికల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే దక్షిణా కొరియాలో ఆత్మహత్యలు రెండింతలు ఎక్కువ. ప్రతీ లక్ష మంది పౌరులకు సగటున 20 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో 2012 నుంచే ఆ దేశంలో అధిక సంఖ్యలో హీలింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. బతికి ఉండగానే శవపేటికలోకి పంపి.. చనిపోయామన్న భావన కల్పిస్తూ జీవితంపై ఆశ కల్పించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో హైవోన్ అనే హీలింగ్ సెంటర్ మంగళవారం ‘డైయింగ్ వెల్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. టీనేజర్లు మొదలు వృద్ధుల దాకా పదుల సంఖ్యలో ఈ ‘లివింగ్ ఫర్నియల్’లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా అంత్యక్రియలకు ముందు చేసే కార్యక్రమాలు పూర్తి చేసి.. అనంతరం పది నిమిషాల పాటు శవపేటికలో పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘చావుపై ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో.. చావు తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో బతికి ఉండగానే మనకు బోధపడతాయో అప్పుడు జీవితాన్ని చూసే విధానంలో మార్పు వస్తుంది. సరికొత్త పంథాలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నాడు. మరో టీనేజర్ తన అనుభవం గురించి వివరిస్తూ... ‘శవ పేటికను చూడగానే ముందు భయం వేసింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతకు ముందు ఎవరిని చూసినా నాకు పోటీదార్లే అంటూ ఒత్తిడికి గురయ్యేవాడిని. అందుకే చచ్చిపోవాలనిపించేది. కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తా’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకుడు జోయింగ్ మాట్లాడుతూ... ‘ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిన ఎంతో మంది నిర్ణయాన్ని నేను మార్చగలిగాను. మేము 2012నుంచి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నేటిదాకా దాదాపు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. సామూహిక అంత్యక్రియల కార్యక్రమానికి ఏడ్చేవాళ్లను కూడా పిలవాలనుకున్నాం. కానీ ఈసారి కుదరలేదు. శవపేటికలో ఉన్నపుడు మన కోసం ఏడ్చేవారి స్వరం విన్నపుడు బలవన్మరణానికి పాల్పడి వారిని ఎంత వేదనకు గురిచేశామో అన్న విషయం అర్థమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
ఇల్లేనయా.. నడిచొచ్చేనయా
సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే ఈ మహానగరంలో ఎంత కష్టమో అందరికీ ఎరుకే. సొంత స్థలం ఉన్నా సరే అనుమతుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఎంతోమంది చేతులు తడపాలి. అన్నీ లెక్కేసుకుంటే వ్యక్తిగత ఇల్లు పూర్తయ్యేసరికి రూ.కోటి దాటడం ఖాయం. ఇక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే నగర శివార్లలో కూడా రూ.60 లక్షలకు పైనే ఉంది. అలాంటిది రూ.12 లక్షలకే డుప్లెక్స్ ఇల్లు వచ్చేస్తే..! పైగా దాన్ని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంటే..!! ఇలాంటి ఇళ్లు నగరంలో వెలుస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆర్డర్లు ఇచ్చి మరీ వెంట తీసుకుపోతున్నారు. కదిలే ఇళ్లని క్వాలిటీ తక్కువగా అంచనా వేయొద్దు.. కనీసం ముప్పై ఏళ్లు గ్యారంటీ అండోయ్. సుభాష్‌నగర్: మన అవసరాలకు అనుగుణంగా ఇల్లు కూడా మనతో పాటే వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచన విదేశాల్లో ఏనాడో వచ్చింది. అందుకే అక్కడివారు కదిలే ఇళ్లను నిర్మించుకుంటారు. ఇలాంటి ఇళ్లు ఇప్పుడు నగరంలోనూ వచ్చేశాయండోయ్! ఇక్కడ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టాలంటే కనీసం రూ.కోటి ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే కనీసం రూ.70 లక్షలు చెల్లించాలి. అలాంటిది అన్ని సౌకర్యాలతో రూ.10 లక్షల లోపే ఇల్లు వచ్చేసిందే అనుకోండి.. సామాన్యుడికి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది! అద్దె ఇంటి కష్టాలు తెలిసిన ఓ వ్యక్తి చేసిన ప్రయోగంవిజయవంతమైంది. ఇంట్లోని సామానులే కాదు.. కావాల్సిన చోటుకి తీసుకుపోయే ఇళ్లను హైదరాబాద్‌లోనే నిర్మిస్తున్నారు. వాటిని చూడాలన్నా, కొనుగోలు చేయాలన్నాఒక్కసారి దూలపల్లికి వెళ్లి రావాల్సిందే. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతానికి చెందిన ఎస్కే జిలానీ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. దూలపల్లిలో ఫ్యాబ్రికేషన్ పనులతో పాటు క్రేన్ల మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జిలానీ విదేశాలకు వెళ్లినపుడు అక్కడ మొబైల్ హౌస్ అతడిని బాగా ఆకర్షించింది. అంతర్జాతీయ పోకడలను వేగంగా అందిపుచ్చుకునే హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఇళ్లు కడితే బాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేశారు. ఆరు నెలల క్రితం దూలపల్లిలో క్రేన్ సహాయంతో సులభంగా తరలించే ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. మొదటిది విజయంతం కావడంతో ఇప్పటికి ఇరవై మొబైల్ హౌస్‌లను నిర్మించి విక్రయించారు. మరో పదిహేను ఇళ్లకు ఆర్డర్ రావడంతో వాటి రూపకల్పనలో బిజీగా మారాడు జిలానీ. ఎంతో ప్రత్యేకం మొబైల్ ఇల్లు కొనుగోలుదారుల ఆసక్తి, అభిరుచికి తగ్గట్టు సౌకర్యాలను బట్టి ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. 200 చ.అడుగుల నుంచి 800 చ.అడుగల వరకు ఇవి ఉంటున్నాయి. నిర్మాణంలో ఇనుము, కలప వినియోగిస్తున్నారు. ఇందులో సింగిల్, డబుల్ బెడ్రూం, డూప్లెక్స్, విల్లా తరహాల్లో కదిలే ఇళ్లను కొనుగోలుదారుల అభిరుచులకు అనుగూణంగా సకల సౌకర్యాలతో అందిస్తున్నారు. పడక గది, వంట గది, హాలు, పెంట్ హౌస్, ఇంట్లో నుంచి మెట్లు, ఇంటిపై వాటర్ ట్యాంక్, బాత్రూమ్, వాష్ బేసిన్.. వాటికి అనుసంధానంగా డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేస్తారు. గోడల మధ్యనే కరెంట్ తీగలను అమరుస్తారు. ఇనుప గోడలు కనుక ఒకవేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా వెంటనే కరెంట్ నిలిచిపోయే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సుమారు 30 ఏళ్ల మన్నిక గల ఈ ఇళ్ల ధర ఆర్డర్ చేసిన విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి కనిష్టంగా రూ.4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంది. అంతే కాకుండా వాస్తు ప్రకారంగా ఇంటిని అందించడం విశేషం. ఒక్కో ఇంటి బరువు 3.5 టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఉంది. వీటిని క్రేన్ సహాయంతో ఒకచోటు నుంచి మరో చోటుకు కంటైనర్లు, లారీల్లో తీసుకుపోవచ్చు. ఫామ్‌హౌస్, గెస్ట్‌హౌస్, రిసార్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీ ప్రాజెక్ట్లోపనిచేసే ఇంజినీర్లు, చేపల చెరువులు, వ్యవసాయ క్షేత్రాల వద్ద, పార్కులు వద్ద నివసించే వారు ఎక్కువగా ఈ మొబైల్ హౌస్‌లను కొనుగోలుచేస్తున్నారు విజయవంతం చేశా.. విదేశాల్లో ఈ మొబైల్హౌస్లను చూశాను. మన దేశంలో కూడా ఇలాంటివి నిర్మించాలని ఆలోచన వచ్చింది. క్రేన్ల మరమ్మతుల వ్యాపారం చేస్తునే మొబైల్ హౌస్ డిజైన్ ప్రారంభించాను. ఇప్పటికి ఇరవై ఇళ్లను విక్రయించాను. ప్రస్తుతం చాలా అర్డర్లు వచ్చాయి.శిల్పారామంలో కూడా 525 చదరపు అడుగుల్లో మొబైల్ హౌస్‌ను నిర్మించి ఇచ్చాం. ఒక్కో ఇంటి తయారీకి 45 రోజుల సమయం పడుతుంది.– ఎస్కే జిలానీ,మొబైల్ హౌస్ నిర్మాణదారుడు దేశంలో మొట్టమొదటిగా.. మనదేశంలో ఇప్పటి దాకా కంటైనర్లలో గదులను నిర్మించి ఇళ్లుగా వినియోగిస్తున్నారు. కానీ దూలపల్లిలో మాత్రం అమెరికా, యూకే, రష్యా, జపాన్ దేశాల్లో ఉన్నట్టు.. అంతే నాణ్యతతో కాంక్రీట్ ఇళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మొబైల్ హౌస్‌లను అన్ని హంగులతో నిర్మించి ఇస్తున్నారు. ఇలాంటి ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశంలో ఇక్కడే తొలిసారి కావడం విశేషం. మొబైల్హౌస్కావాలనుకునే వారు 95500 11786, 98498 90786 నంబర్లలోసంప్రదించవచ్చు. -
ఒక్క ఛాన్స్ కోసం..
పెదగంట్యాడ (గాజువాక) : నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో.. పొగరని అందరు అన్నా.. అది మాత్రం నా వైజం! తెలువని కొందరు అన్నా.. అది నాలో మేనరిజం! నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు..!! 'నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతు పాలు తాగడం సమ్‌థింక్ స్పెషల్' అంటున్నారు ఈ తరం అబ్బాయిలు. అందుకే ట్రెండ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాల కొద్దీ కష్టపడుతున్నారు. నగరంలో ఇటువంటి టేలెంటెడ్ గైయ్స్పై ఈ కథనం.. కోత్తగా ట్రై చేస్తున్న యూత్ అవును... ఇది నిజం సినిమా డైలాగ్ కాదు నాకు ఇగో వైఫైలాగా చుట్టూ ఉంటది అని చెప్పుకోవడానికి బాగున్నా ప్రతి మనిషిలో ఈగో ఫీలింగ్ అంతో ఇంతో ఉంటుంది. ఇది ప్రస్తుతం యువతపై చాలా ప్రభావం చూపుతోంది. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి అందరూ తమదైన కొత్త స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో అయితే సినిమా హీరోల గెటప్‌లను ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ పోయింది. యువత కొత్త బాట పట్టింది. వారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొత్త మేనరిజమ్స్ స్టైల్‌తో పాటు కెరియర్ను కూడా ఎవరికి వారే క్రియేట్ చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం పోకిరీ సినిమాలో మహేశ్‌బాబు ముక్కును వేలుతో రుద్దితే అది స్టైల్‌గా ఫిక్సైంది. అంతకు ముందు అలా అంటే జలుబు చేసిందా అని అడిగేవారు. అలాగే ఇప్పుడు యువత కొత్త కొత్త క్రియేషన్స్ నాంది పలుకుతున్నారు. స్టైల్ ఐకాన్లుగా... పెరిగిన ఫొటోగ్రఫీ కారణంగా ప్రతి వ్యక్తి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని, తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుంటే సమాజంలో తనని కొత్తగా గుర్తిస్తారనే తపన యువతలో పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ స్టైలిష్ ఐకాన్లుగా మారుతున్నారు. ఎక్కడో చూసి కాపీ కొట్టినట్టుగా కాకుండా తమకంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు సందీప్ అనే కుర్రాడికి సినిమాలో హీరోగా నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకోసం చాలా కష్టపడి తన హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అన్ని మార్చుకున్నాడు. ఇక రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే తన స్టైల్‌ను కొనసాగిస్తున్నాడు. అలాగే షణ్ముక్ అనే మరో డాన్సర్‌కు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని చాలా తహతహలాడుతున్నాడు. అందుకే చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. కాని అందరిలాగే తనను కూడా చూస్తున్నారని భావించాడు. దీంతో తనలోని డ్యాన్స్ టాలెంట్‌కు పని చెప్పాడు. లేటెస్ట్గా రిలీజైన సూపర్ హిట్ పాటలకు తనే డాన్స్ చేసి వీడియో తయారు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి వీడియోలకు ఆదరణ బాగా పెరిగింది. వైజాగ్‌లో మేల్ మోడల్స్ చాలా తక్కువ నిజం చెప్పాలంటే వేళ్లమీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. ప్రేమ్, కార్తిక్‌లు ఎన్ని కష్టాలు ఎదురైనా తను అనుకున్న ప్రొఫెషన్లో కొనసాగడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అలాగే భార్గవ్ అనే యువకుడు కాక్ టెయిల్ అనే హిప్ హాప్ మ్యూజిక్ ట్రూప్‌ను ఏర్పాటు చేసి తెలుగులో హిప్ హాప్ సాంగ్స్ చెయ్యడానిక ప్రయత్నిస్తున్నారు. ఎంవీపీలో బి ఫర్ బిర్యానీ పేరుతో బిర్యానీకీ బ్రాండ్ క్రియేట్ చేసి రాష్ట్రమంతటా బ్రాంచ్‌లు క్రియేట్ చెయ్యడానిక కొంత ముంది యువకులు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు రంగాల్లో ప్రస్తుతం ఇలాంటి యువకులు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చేస్తున్న పని ఏదైనా దీన్ని గౌరవించి పది మందికి నచ్చుతుందనే నమ్మకంతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులంతా ఎప్పుడో ఒకప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు. దాని కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు. కాని ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తమను తాము నిరూపించుకోవడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తామని అంటున్నారు. అందుకే స్టైల్ ఐకాన్లుగా నిలబడటానికి యువత పడుతున్న తపన చాలా మందికి ఆదర్శం కావాలని కోరుకుందాం. వాళ్లంతా వైజాగ్ పేరును నిలబెట్టడాని ఏదో ఒకరోజు పైకొస్తారని ఆశిద్దాం. -
సమ్‌థింగ్ స్పెషల్ సంక్రాంతి
నిర్మల్‌రూరల్ : ‘వావ్.. సంక్రాంతి ఫెస్టివల్.. సమ్‌థింగ్ స్పెషల్ హై..’ అంటూ నాగాలాండ్వాసులు సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని వాసవి పాఠశాలలో ఉపాధ్యాయినులుగా బోధిస్తున్న నాగాలాండ్వాసులు మంగళవారం స్కూల్లో నిర్వహించిన సంబురాల్లో పాలుపంచుకున్నారు. రంగుల ముగ్గులు వేస్తూ ఆటపాటల్లో పాల్గొన్నారు. బోగిమంటలు, గంగిరెద్దుల ఆటలను ప్రత్యేకంగా గమనించారు. గంగిరెద్దులతో కలిసి ఫొటోలూ దిగారు. -
ఈ నెల.. చాలా ప్రత్యేకం
ఈ ఏడాది అక్టోబర్ మాసానికి చాలా ప్రత్యేకత ఉందండోయ్... అదేమంటారా? అయితే మీరే చూడండి.... ఈ అక్టోబర్‌లో ఐదేసి చొప్పున శని, ఆది, సోమవారాలు వస్తాయి. అంతేకాదండోయ్! ఈ నెలలో వచ్చే పౌర్ణమి (16), అమావాస్య(30) రెండూ ఆదివారమే కావడం విశేషం. ఇక ఈ మాసమంటరా... పిల్లలకు బోల్డన్ని సెలవులను మోసుకొస్తోంది. పండుగలతో ఉత్సాహాన్ని నింపబోతోంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే... ఇలాంటి నెల 803 సంవత్సరాల కిందట అంటే 1153లో మాత్రమే వచ్చినట్లు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కొడేకండ్ల నాగభూషణరావు అంటున్నారు. ఔను కదా! అక్టోబర్–16 అంటే నిజంగా సమ్‌థింగ్ స్పెషలే మరీ... -
కాటన్ బాల్ కాదు... భౌ భౌవే!
సమ్‌థింగ్ స్పెషల్ తెల్లటి మేఘమా? లేనిచో దూది బంతియా?... టోరీని చూడగానే ఇలా కవిత్వం అల్లే వాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువయ్యారు. ఎవరీ టోరీ? ఏమా కథ? సౌత్ కొరియాలోని డాగులో యజమానుల ఇంట్లో ఉండే బికాన్ జాతీ పప్పీ పేరు టోరీ. పెద్ద తలకాయ ఉండడమే మన టోరీ ప్రత్యేకత. యజమానులు టోరీ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో... టోరీ హీరో అయిపోయింది. టోరీకి ప్రపంచ వ్యాప్తంగా 64,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. -
నెదర్లాండ్స్ కార్పస్ మ్యూజియం
మీలో మీరెప్పుడైనా తొంగి చూశారా? చూడలేదా.. నెదర్లాండ్స్‌లోని కార్పస్ మ్యూజియానికి వెళ్తే.. మనకా అవకాశం లభిస్తుంది. ఈ మ్యూజియం మానవ శరీర పనితీరును వివరిస్తుంది. ఓ భారీ మానవ శరీరం ఆకారంలో ఉండే బొమ్మలోకి వెళ్లడం ద్వారా అందులోని ప్రతి భాగం పనితీరును క్షుణ్నంగా తెలుసుకోవచ్చు. కాళ్ల దగ్గర నుంచి మొదలుపెడితే.. మెదడు దాకా.. అచ్చంగా మన శరీరం ఎలా పనిచేస్తుందో ఇదీ అలాగే పనిచేస్తుంది. ఆహారాన్ని పేగులు జీర్ణం చేసుకోవడాన్ని కూడా వీక్షించొచ్చు. కడుపులో వచ్చే శబ్దాలు కూడా వినిపిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనం, వ్యాయామం వంటివి శరీరంపై ఎలాంటి సానుకూల ఫలితాలు చూపుతాయన్న విషయాన్ని స్వయంగా గ్రహించవచ్చు. ఆమ్స్టర్డామ్ నుంచి హేగ్‌కు వెళ్లే దారిలో ఈ కార్పస్ మ్యూజియం ఉంటుంది. -
ప్రతి కుక్కకూ ఓ డిగ్రీ వస్తుంది...
-
ప్రతి కుక్కకూ ఓ డిగ్రీ వస్తుంది...
సమ్‌థింగ్ స్పెషల్ ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనేది పాత సామెత. ప్రతి కుక్కకూ ఓ డిగ్రీ వస్తుందనేది సరికొత్త సామెత. కుక్కలకు డిగ్రీలా..? అని నోరెళ్లబెట్టకండి. ఔను! అదే ఆ యూనివర్సిటీ స్పెషాలిటీ. మనుషులకే కాదు, ఫీజు కట్టి కోర్సులో చేరితే జంతువులకు, పక్షులకు... వీలుంటే, క్రిమికీటకాదులకు కూడా ఎడా పెడా డిగ్రీలు ఇచ్చేస్తుంది. ఏదా వర్సిటీ.. ఏమా కథ.. అనుకుంటున్నారా..? అక్కడికే వచ్చేద్దాం. ఇంత ధారాళంగా డిగ్రీలు ఇచ్చే ఆ మహత్తర మహిమాన్విత విశ్వవిద్యాలయ నామధేయం అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్. చదువులేని వాళ్లమని దిగులు చెందేవారికి ఊరటనివ్వాలనే సదుద్దేశంతో 1984లో లండన్ నగరంలో వెలసింది. తొలుత ఇది ‘అమెరికన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పేరిట దూర విద్యా కేంద్రంగా ప్రారంభమైంది. డిగ్రీల వితరణలో కొంత ముదిరిన తర్వాత ‘అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ లండన్’గా పేరు మార్చుకుని, పని వేగాన్ని పెంచింది. బ్రిటన్‌కు మాత్రమే పరిమితం కాకుండా, సౌదీ అరేబియాకూ శాఖను విస్తరించింది. ఫీజు కట్టేస్తే చాలు, చదివినా.. చదవకున్నా.. చివరకు పరీక్షకు హాజరు కాకున్నా డిగ్రీల ప్రదానమే లక్ష్యంగా పెట్టుకుని ఆ విధంగా ముందుకుపోవడం ప్రారంభించింది. డిగ్రీల వితరణలో ఘనత వహించిన ఈ వర్సిటీ ఔదార్యానికి తెగ ముచ్చటపడిన ప్రముఖ న్యూస్ చానల్ ఒక ప్రయోగం చేసింది. ఒక జాగిలం పేరిట ఎంబీఏ డిగ్రీ కోసం తొలుత 50 పౌండ్లు (సుమారు రూ. 5 వేలు) దరఖాస్తు ఫీజు చెల్లించింది. జాగిలం గారి దరఖాస్తును స్వీకరించినట్లు వర్సిటీ నుంచి ప్రత్యుత్తరం రావడంతో, కోర్సు ఫీజుగా 4500 పౌండ్లు (సుమారు రూ.4.50 లక్షలు) కట్టింది. ఫీజు ముట్టిన కొద్దిరోజులకే ఈ వర్సిటీ జాగిలం గారి పేరిట ఎంబీఏ డిగ్రీని నిక్షేపంగా కొరియర్లో పంపింది. -
సమ్‌థింగ్ స్పెషల్.. ‘మెట్రో’ స్టేషన్
-
సమ్‌థింగ్ స్పెషల్.. ‘మెట్రో’ స్టేషన్
హైదరాబాద్: నగరంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ మెట్రో స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయి..తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ స్టేషన్లో వాణిజ్య ప్రకటనల బోర్డులు, రిటెయిల్ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేశారు. రహదారి పైనుంచి లిఫ్ట్ లేదా మెట్ల మార్గం నుంచి పైకి చేరుకోగానే స్టేషన్ మధ్యభాగం(కాన్కోర్స్) వాణిజ్య మాల్‌ను తలపిస్తోంది. సుమారు పదివేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో పలు రిటెయిల్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. గురువారం ఉప్పల్ మెట్రో స్టేషన్లో పొలిటోస్ చికెన్ స్టోర్‌ను ఎల్అండ్టీ మెట్రో రైలు ఎం.డీ వీబీగాడ్గిల్ ప్రారంభించారు. ఇక ఇక్కడున్న పిల్లర్లు సహా స్టేషన్‌లోనికి ప్రవేశించే బయటికి వెళ్లే మార్గాలు, రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాలపై వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు వీలుగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 64 స్టేషన్లలో కొన్నింట చిన్నారులు, మరికొన్ని చోట్ల మహిళల వస్తువులు దొరికేవి మరి కొన్నింట ఎలక్ట్రానిక్ వస్తువులు దొరికేవిగా, మరికొన్ని స్టేషన్లు వినోదం అధికంగా ఉండే స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. స్టేషన్లలో వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు... మెట్రో పిల్లర్లు, పోర్టల్స్, వయాడక్ట్స్, స్టేషన్ లోపల, బయట, ప్లాట్‌ఫారంపై, మెట్రో రైలు లోపల,బయట వివిధ సంస్థలు వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటు చేశారు. వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు advertising@ltmetro.com వెబ్‌సైట్‌ను చూడవచ్చు. స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి వాణిజ్య ప్రకటనలకు చార్జీలు వసూలు చేస్తారు. మూడు మార్గాల్లో 64 స్టేషన్లు.. ఎల్బీనగర్-మియాపూర్(కారిడార్1) జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్2) నాగోలు-రాయదుర్గం (కారిడార్3) మార్గంలో మెత్తం 64 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు ఏర్పాటుచేయనున్నారు. స్టేషన్లను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో 55 స్టేషన్లను టిపికల్ స్టేషన్లు(రద్దీ అధికం), అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్‌గ్రౌండ్స్ ప్రాంతాల్లో రెండు మెట్రో కారిడార్లు కలిసేచోట ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. ఇక హైటెక్‌సిటీ, పంజాగుట్ట, శిల్పారామం, బేగంపేట్ స్టేష్టన్లను ప్రత్యేక స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. టిపికల్ స్టేషన్లో వాణిజ్య స్థలం 2500 చదరపు అడుగుల నుంచి 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. స్టేషన్ లోనికి ప్రవేశించే,బయటికి వెళ్లే మార్గాల్లో వెయ్యి నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటెయిల్ స్పేస్ ఉంటుంది. రిటెయిల్ స్పేస్‌లో కనిష్టంగా 100చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 350 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఇంటర్‌ఛేంజ్,స్పెషనల్ స్టేషన్ల లో గరిష్టంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటెయిల్ దుకాణాలుంటాయి. స్టేషన్లలో లభించే వస్తువులు.. రిటెయిల్ దుకాణాలు: కన్వీనియన్స్,నిత్యావసరాలు,కూరగాయలు,రోజువారీ అవసరాలు,యాక్ససరీలు ఫుడ్ అండ్ బ్రూవరీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, లార్జ్ ఫార్మాట్ ఫుడ్‌కోర్ట్స్ సర్వీసులు: ఎటీఎం, మెడికల్ స్టోర్లు, లాండ్రీ సెంటర్లు మెట్రో స్టేషన్లలో దుకాణం ఏర్పాటు చేయాలంటే... మొత్తం 64 మెట్రో స్టేషన్లలో సుమారు 3.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం అందుబాటులో ఉంది. స్టేషన్‌ను బట్టి ప్రతి చదరపు అడుగుకు నెలకు కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.450 వరకు అద్దె వసూలు చేస్తారు. ఇప్పటివరకు మొత్తంగా 25 శాతం వాణిజ్య స్థలం కేటాయింపు పూర్తయ్యింది. రాయదుర్గం, హైటెక్‌సిటీ, ఎర్రమంజిల్, అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లలోనూ వాణిజ్యస్థలాలను పూర్తిగా అద్దెకిచ్చారు. వాణిజ్య స్థలం కావాలనుకునేవారు హైటెక్‌సిటీ సైబర్‌టవర్స్‌లోని ఎల్అండ్టీ మెట్రో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. అనుభవం,అర్హతలతోపాటు ముందుగా వచ్చినవారికే ప్రాధాన్యతనిస్తామన్నారు. -
అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..
టోక్యోలోని ప్రముఖ పాఠశాల కొమాబా హైస్కూల్లో ‘మిస్ కొమాబా’ అందాల పోటీ జరుగుతోంది. అందగత్తెలంతా బారులు తీరారు. తుది రౌండ్ అనంతరం సూపర్‌గా ఉన్న ఓ అమ్మాయికి మిస్ కొమాబా కిరీటధారణ చేశారు. రోటీనేగా.. ఇందులో సంథింగ్ స్పెషలేముంది అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ ఉంది. ఈ ఏడాది మిస్ కొమాబా టైటిల్ గెలిచింది ఓ అబ్బాయి! ఈ ఏడాది కాదు.. ప్రతి ఏడాదీ ఇక్కడ ఈ టైటిల్ గెలిచేది అబ్బాయిలే!! ఎందుకంటే.. ఇది అబ్బాయిలు మాత్రమే చదివే స్కూలు కాబట్టి.. కొమాబా హైస్కూల్ కొన్నేళ్లుగా ఈ వినూత్నమైన అందాల పోటీని నిర్వహిస్తోంది. అబ్బాయిలు అచ్చంగా అమ్మాయిల్లా తయారై.. ఈ పోటీలో పాల్గొంటారు. ఇదేదో అషామాషీ వ్యవహారంలా ఉండదు. వీళ్లు అమ్మాయిలే అసూయపడేంత అందంగా తయారవుతారు. ఫొటోలు చూడండి.. మీకే అర్థమవుతుంది. -
కత్రినా కైఫ్ (అ)యిష్టాలు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇష్టం!
కత్రినా కైఫ్ (అ)యిష్టాలు ఇప్పుడున్న బాలీవుడ్ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ సమ్‌థింగ్ స్పెషల్‌గా అనిపిస్తారు. కేవలం గ్లామర్ డాల్... ఐటమ్ గాళ్ అనుకున్న కత్రినా తనకంటూ ఓ సెపరేట్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఓపెన్‌గా మాట్లాడటాన్ని లైక్ చేసే కత్రినా చెప్పిన లైక్స్, డిస్‌లైక్స్.. ఇష్టాలు ►: బేబీ పింక్ కలర్ అంటే కత్రినాకు బోల్డంత ఇష్టం. స్కై బ్లూ, రెడ్ కలర్స్ అంటే కూడా మక్కువ. ►: లివింగ్ రిలేషన్షిప్ అంటే ఇష్టం. జీవితానికి సో స్పెషల్ అనిపించే వ్యక్తితో సహజీవనం చేయడానికి వెనకాడరు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో సహజీవనం చేస్తున్నారట. ►: పాపులార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం. మోడల్‌గా చేయడానికీ, సినిమాల్లోకి రావడానికీ అదో కారణం. ►: ఆడి కార్ అద్భుతం అంటారు. ► : ఓపెన్‌గా మాట్లాడేవాళ్లను లైక్ చేస్తారు. ► : వెడ్డింగ్ డ్రెస్ ఇష్టం. అందుకు పూర్తి భిన్నంగా ఉండే బికినీ అంటే చాలా చాలా ఇష్టం. ► : బ్లాక్ కాఫీ బాగా అలవాటు. ఇండియన్స్ తినేట్లు పెరుగన్నం తినడం ఈ విదేశీ భామకు ఇష్టం. ►: ప్రముఖ నవలా రచయిత సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకాలు తెగ చదువుతారు. ►: స్పోర్ట్స్‌లో క్రికెట్, చెస్ అంటే ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా చెస్ ఆడుతుంటారు. అడపా దడపా క్రికెట్ కూడా ఆడతారు. కత్రినా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ‘ఇర్ఫాన్ పఠాన్’. ►: హాలీవుడ్ స్టార్స్ లియొనార్డొ డికాప్రియో, జానీ డెప్, బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ అంటే ఇష్టం. అయిష్టాలు ►: నర్మగర్భంగా మాట్లాడేవాళ్లంటే అసహ్యం. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటారు. ►: ఫలానా హీరోతో పెళ్లయ్యిందంటూ తన గురించి వచ్చే వార్తలను ఇష్టపడరు. ►: మేకప్ అంటే చిరాకు. అందుకే షూటింగ్స్ లేనప్పుడు దాని జోలికి వెళ్లరు. ‘రాజ్‌నీతి’ చిత్రానికి తక్కువ మేకప్ చాలని చిత్రదర్శకుడు ప్రకాశ్ ఝా చెప్పినప్పుడు తెగ ఆనందపడ్డారట. ► : ఎదుటి వ్యక్తుల్లో అదే పనిగా తప్పులు వెతికేవాళ్లను ఆమడ దూరంగా ఉంచేస్తారు. ► : రణ్‌బీర్ కపూర్ గాళ్ ఫ్రెండ్ కత్రినా అని ఎవరైనా అంటే అస్సలు ఇష్టపడరు. నాకంటూ ఓ పేరు ఉంది కదా అంటారు. జనరల్‌గా కత్రినాని ముద్దుగా ‘కాట్’ అని పిలుస్తుంటారు. అలా పిలిస్తే ఆమెకు నచ్చదు. ► :హర్రర్ సినిమాలంటే అయిష్టం. అందుకని వీలైనంత వరకూ అలాంటి చిత్రాలు చూడరు. ► : మీడియావాళ్లు పర్సనల్ లైఫ్ గురించి అడగడం ఇష్టపడరు. ► : అతిగా వాగడం నచ్చదు. ఉదాహరణకు ఉదయం షూటింగ్‌కి లొకేషన్‌కి వెళ్లాక సరిగ్గా ముగ్గురికి ‘గుడ్ మార్నింగ్’ చెప్పడంతోనే అసహనం వచ్చేస్తుందట. ► : స్పైసీ ఫుడ్ నచ్చదు. అందుకని ఇండియా వచ్చిన తొలి రోజుల్లో చాలా కష్టంగా ఉండేదట. ఇప్పటికీ స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉంటారు. ► : ఆడవాళ్లను గౌరవించని మగవాళ్లంటే అసహ్యం. అమ్మాయిలకు ఆంక్షలు పెట్టేవాళ్లంటే మంట. -
కంగారు పాట్లు..!
సమ్‌థింగ్ స్పెషల్ ఆస్ట్రేలియా జనాభా కన్నా ఆ దేశంలో ఉన్న కంగారూల సంఖ్యే ఎక్కువ. ఆ దేశ జాతీయ జంతువు అయిన కంగారూలు కేవలం అడవులకు మాత్రమే పరిమితం కాకుండా జనారణ్యంలోకి కూడా చొరబడిపోతుంటాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేంత వరకూ వచ్చేస్తుంటాయి. ఇక కాస్త అటవీ ప్రాంతానికి దగ్గరగా నివాసం ఉండే వాళ్ల ఇళ్లల్లోకి కంగారూల చొరబాట్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అలా వచ్చిన కంగారూగా కూజాలో తలపెట్టి ఇరుక్కుపోయిన కంగారు ఇది. దక్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలోని ఒక పల్లెటూరులో ఈ కంగారూ పడ్డ పాట్ల ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయ్యాయి. నీళ్ల కోసం ఒక పూలతోటపక్కకు వచ్చి అక్కడ ఉంచిన కూజాలోకి తలపెట్టింది కంగారూ. తల సులభంగా లోపలకు వెళ్లింది కానీ.. బయటకు తీసుకోవడం మాత్రం చాలా కష్టం అయ్యింది. కొంతసేపటికి దీని పాట్లను అక్కడి వ్యక్తులిద్దరు గమనించారు.. సున్నితంగా తప్పిద్దామంటే ఇది చేతికి చిక్కే జంతువు కాదు.. నియంత్రించడానికి కష్టం. దీంతో వారు కాస్త బుర్రకుపదును పెట్టి తాడును కూజాకు కట్టి లాగారు. తోకవైపు ఒకరు, తలవైపు మరొకరు నిలబడి కూజా నుంచి దాన్ని తప్పించడానికి ప్రయత్నించారు. అలా కొన్ని గంటల పాటు శ్రమపడ్డారు. చివరకు విజయం సాధించారు. కూజా నుంచి తల బయటకు రావడంతో కంగారూ ‘బతుకు జీవుడా..’ అనుకొన్నట్టుగా బిత్తరచూపులతో పరుగులు తీసింది! -
పేరులోనే గిరాకి ఉంది!
సమ్‌థింగ్ స్పెషల్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి పేరు ముఖ్యమైనదని కొందరు వ్యాపారులు బలంగా నమ్ముతున్నారు. మన దేశంలోని ప్రధాన నగరాలలో కొన్ని దుకాణల పేర్లు వింతగా ఉండి, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలో ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పేరు ‘ఫేస్బుక్’. ముంబాయిలోని ఒక ఫాస్ట్‌పుడ్ సెంటర్ పేరు...‘బీటెక్ చాట్ వాలా’ ముంబాయి రైల్వేస్టేషన్ సమీపంలో చెప్పులు కుట్టే ఒక వ్యక్తి తన దుకాణానికి ‘చెప్పుల ఆస్పత్రి’ అని పేరు పెట్టుకున్నాడు. ముంబయిలో లోదుస్తులు అమ్మే ఒక చిన్న షాప్‌కు ‘అందర్ వియర్’ అని పేరు పెట్టారు. కొన్ని నగరాల్లో ‘వాట్సప్’ పేరుతో పండ్లరసాల బండ్లు వీధుల్లో తిరుగుతున్నాయి. -
సమ్‌థింగ్ స్పెషల్
ఇంటి పరిసరాల్లో పచ్చదనం పరవాలని ఎవరికి ఉండదు! కానీ... కాంక్రీట్ జంగిల్... అపార్ట్మెంట్ కల్చర్‌లో వుట్టి నేల వూట ఎలా ఉన్నా... కాస్త ఖాళీ కనిపించే పరిస్థితి ఎక్కడుంది! అరుుతే బాల్కనీ... లేదంటే పోర్టికో... ఇంతకు మించి మొక్కలు పెంచడానికి స్థలం దొరకదు. అందుకే కుండీల్లో పంటకు సిటీలో వూంచి క్రేజ్. ఉన్నదాంట్లోనే పూలు, ఆకు కూరల వంటివి పండించేస్తున్నారు చాలా వుంది. వురి వుర్రి వంటి పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవాలంటే..! అమ్మో.. అదెలా సాధ్యవునేగా! ఆ కోరిక తీర్చుకోవచ్చంటున్నారు నర్సరీ నిర్వాహకులు. కొనుగోలుదారుల ఆసక్తి, ఆకాంక్షకు తగినట్టుగా ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ మొక్కలను అభిరుచికి తగినట్టుగా కుండీల్లో అలంకరించి ఇచ్చే నయూ పద్ధతికి శ్రీకారం చుట్టారు. వుర్రి లాంటి భారీ జాతుల వృక్షాలను సైతం బోన్సాయి వృక్షాలుగా మార్చి అందంగా తీర్చిదిద్దుతున్నారు. హాలు, బాల్కనీల్లో పెట్టుకోవడానికి వీలుగా వీటిని రూపొందిస్తున్నారు. వీటితో పాటు రకరకాల మొక్కలను విభిన్నంగా అలంకరించి అందిస్తున్నారు. చెట్టు కాండాన్ని తొలిచి ఇలా అలంకరిస్తారు. దీనిపై కావల్సిన రంగుతో పాటు డిజైన్ కూడా వేస్తారు. స్థలం కాస్త ఎక్కువగా ఉండే ఇళ్ల కోసం ఈ వెరైటీలు స్టేటస్ సింబల్... కుండీల్లో భారీ చెట్లను పెంచుకోవడం సమ్‌థింగ్ స్పెషలే కాదు... స్టేటస్ సింబల్‌గా భావించేవారు సిటీలో చాలావుందే ఉన్నారు. వారి అభిరుచికి తగినట్టుగా పది నుంచి ఇరవై మర్రి మొక్కలను తొట్లలోనే లతలుగా అల్లుతున్నాం. మొక్కలను బట్టి రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతుంది. ఇలా వూ నర్సరీలో 1,500కు పైగా వెరైటీ మొక్కలు అందుబాటులో ఉన్నాయుని చెబుతున్నారు కొంపల్లి సమీపంలోని ‘గ్రోమోర్ ఫుడ్ నర్సరీ’ నిర్వాహకుడు ప్రవీణ్ సత్యార్థి. - కె.యుశ్వంత్రెడ్డి -
పంచ్‌లు ఇవ్వండి...పైసలు కూడా ఇవ్వండీ!
సమ్‌థింగ్ స్పెషల్ ‘‘నేను మనిషిని కాదు. పంచ్ బ్యాగ్‌ను. గట్టిగా పంచ్‌లు ఇవ్వండి. ఆ తరువాత మీకు తోచిన డబ్బులు ఇవ్వండి’’ అంటున్నాడు షుపింగ్. చైనాలోని వుహన్ నగరంలోని బార్లు, నైట్‌క్లబ్‌లు, వీధుల్లో నిల్చొని ‘‘కమాన్.. రండీ’’ అని పిలుపునిస్తుంటాడు నలభై ఎనిమిది సంవత్సరాల షుపింగ్. ఇదేదో సరదాగా ఉందనుకొని దారిన పోయే దానయ్యలు షుపింగ్కు పంచ్‌లు ఇచ్చి ఆ తరువాత డబ్బు ఇస్తారు. మొత్తానికైతే పింగ్ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే పింగ్ చేస్తున్న పని అతని భార్యా బిడ్డలకు బొత్తిగా నచ్చడం లేదు. ‘‘వద్దు మొర్రో’’ అంటున్న వినిపించుకోవడం లేదు పింగ్. ఒక సూపర్ మార్కెట్ ప్రమోషన్ షోలో భాగంగా ‘హూమన్ పంచ్’ అవతారం ఎత్తాడు. మంచి స్పందన లభించడంతో దీన్నే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు అనుకున్నాడు షుపింగ్. ‘‘మొదట నేను దీన్ని జీవికగా ఎంచుకోవాలనుకోలేదు. ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. డబ్బులు బాగానే వస్తున్నప్పుడు... వేరే వృత్తి ఎంచుకోవడం ఎందుకని ఇదే వృత్తిలో స్థిరడ్డాను’’ అంటున్న షుపింగ్ తన వృత్తిని ‘అసాధారణమైన వృత్తి’ అని అభివర్ణిస్తుంటాడు. -
చెట్టు ఎక్కి ఇల్లు కట్టారు!
అహోరాత్రులు శ్రమించి 85 అడుగుల చెట్టు ఇంటిని నిర్మించారు ఇంగ్లండ్‌కు చెందిన ఎల్డెన్ కోన్లే, హారీ, హైనెస్ అనే కుర్రాళ్లు. విశేషం ఏమిటంటే ఈ వృక్షగృహాన్ని నిర్మించడానికి సుత్తులు, మేకులలాంటివి ఏవీ వాడలేదు. ‘‘ఒకవైపు ఎండ దంచేస్తోంది. మరోవైపు ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దాలనే తపన. మా తపన ముందు ఎండ చిన్న బోయింది’’ అని గుర్తు చేసుకున్నాడు హెనెస్. పందొమ్మిది సంవత్సరాల ఈ కుర్రాడు ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు. ఆక్స్ఫర్డ్షైర్లోని ఒక వ్యవసాయక్షేత్రంలో ఈ చెట్టిల్లు కడుతున్న క్రమంలో చిన్నా చితకా గాయాలయ్యాయి. అయితే వాటిని లెక్క చేయకుండా ముందుకెళ్లారు. ఇదంతా ఒక ఎత్తయితే ఫామ్ యజమాని టిమ్ టేలర్ భయాలు మరో ఎత్తు! ‘‘అయ్యో..మీకు ఏమన్నా అవుతుందేమో. రిస్కు తీసుకుంటున్నారేమో’’ ‘‘చెట్టు మీద నుంచి కింద పడతారేమో’’ ఇలా ఏవేవో ఊహించుకొని భయపడుతూ ఉండేవాడు. అతనికి నచ్చజెప్పి పనిలోకి వెళ్లడానికి తలప్రాణం తోకకు వచ్చేది. పనంతా పూర్తయిన తరువాత మాత్రం ముగ్గురు మిత్రులనూ తెగ మెచ్చుకున్నాడు ఆ వ్యవసాయక్షేత్ర యజమాని. ‘‘వాళ్ల పట్టుదల చూస్తే ముచ్చటేసేది’’ అని కుర్రాళ్ల పనితనం గురించి గొప్పగా చెబుతాడు టేలర్. ఫేస్బుక్లో ‘బ్లూ ఫారెస్ట్ ట్రీ హౌజ్’ నిర్వహించిన ‘బెస్ట్ ట్రీ హౌజ్’ పోటీలో ఈ ముగ్గురు మిత్రుల ‘వృక్షగృహం’ మొదటి బహుమతి గెలుచుకుంది. ‘‘ఎప్పుడూ ఈ చెట్టింటిలోనే నివసించాలనేంత గొప్పగా ఉంది’’ అంటున్నారు న్యాయనిర్ణేతలు. -
సమ్‌థింగ్ స్పెషల్
నే ఆటోవాణ్ణి...అందరివాణ్ణి! ‘ఆటోలలో అన్నాదురై ఆటో వేరయా...’ అనుకుంటారు అందరూ. చెన్నైకి చెందిన అన్నాదురై ఆటోకు ఇతర ఆటోలలో లేని సౌకర్యాలు ఉన్నాయి. గ్రంథాలయాన్ని తలపించేలా పుస్తకాలు ఉంటాయి. మొబైల్ ఫోన్ ఛార్జర్, వై-ఫై, టాబ్లెట్లు ఆటోలో ఉంటాయి. ఆటోలో ప్రయాణిస్తున్నంత సేపు వాటిని ఉచితంగా వాడుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే ఆటో ఎక్కిన ప్రతి కస్టమర్‌కు లక్కీ కూపన్ ఇస్తాడు. నెల చివరిలో డ్రా తీసి విజేతను ఎంపిక చేస్తాడు. డ్రాలో గెలిచిన వారు నెల మొత్తం ఉచితంగా ప్రయాణించవచ్చు. కొన్నిసార్లు నగదు బహుమతి కూడా ఉంటుంది. వచ్చిన ఆదాయంలో సగం పేదలకు పంచాలనేది ఇరవై ఎనిమిది సంవత్సరాల అన్నాదురై ఆశయం. కూలీ పనులు చేసే శ్రామికులు, ఆస్పత్రిలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులు ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ ఆటో ప్రయాణించవచ్చు. ‘‘కస్టమర్ తృప్తి చెందడమే నాకు ముఖ్యం. కస్టమరే నా దేవుడు’’ అంటాడు అన్నాదురై. ఈ యువకుడు తన సొమ్ములో అధిక భాగాన్ని చెన్నైలోని వీధిపిల్లల సంక్షేమానికి ఖర్చు చేస్తాడు. గత సంవత్సరం ముగ్గురు పిల్లలను సొంత ఖర్చుతో చదివించాడు. వృద్ధులకు సహాయపడుతుంటాడు. ‘‘మనం ఎవరికైనా మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు’’ అని సింపుల్‌గా తన ఫిలాసఫీ గురించి చెబుతున్నాడు అన్నాదురై. ఈ కుర్రాడు...కారు తయారుచేశాడు! ప్రతిభ ఉదయపూర్(రాజస్థాన్)కు చెందిన యువ ఇంజనీర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ శారీరకవైకల్యం ఉన్న వారి కోసం ఒక ప్రత్యేకమైన కారును తయారుచేశాడు. ఈ కారును చాలా సులభంగా ఆపరెట్ చేయవచ్చు. జోధ్‌పూర్‌లో ఎంయిసిఆర్సి ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఖదీర్‌కు కొత్తగా ఆలోచించడమన్నా, కొత్త వస్తువులు కనిపెట్టడమన్నా చాలా ఇష్టం. ‘‘ఆటో క్లచ్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకొని సులభమైన కంట్రోలింగ్ పవర్ ఉన్న కారును రూపొందించాను. తమ జీవితంలో ఒక్కసారైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపని వారు కూడా దీన్ని నడపవచ్చు’’ అంటున్నాడు ఖదీర్. పుసుక్కున డౌటు అడిగితే... క్లాస్రూమ్ ఇంటర్ చదివే రోజుల్లో రమణమూర్తి అనె లెక్చరర్ ఉండేవారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చాలా బాగా చెప్పేవారు. అయితే ఆయనకు ఒక వింత అలవాటు ఉండేది. పాఠం చెబుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా డౌటు అడిగితే...క్లాస్ మొత్తం ఆ డౌటు గురించే చెప్పేవారు. ఎప్పుడైనా మాకు క్లాస్ బోర్ కొడితే కావాలనే సబ్జెక్ట్‌కు సంబంధం లేని డౌటు అడిగేవాళ్లం. ‘సార్...శంకరాభరణం సినిమా పాటలు రాసిందా వేటూరా? సినారెనా?’’ అని అడిగితే- ‘‘ఇలాంటి డౌట్లు ఇప్పుడా అడగటం?’’ అని విసుక్కుంటూనే ఆ సినిమాలోని పాటల గొప్పదనం గురించి క్లాస్ టైం అయిపోయే వరకు చెబుతూనే ఉండేవారు. ఈ సరదా సంగతి ఎలా ఉన్నా ఆయన పుణ్యమా అని ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. - బి.విక్రమ్, తాడేపల్లిగూడెం -
బిఫోర్ దే పాస్...
ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య చిన్న చిన్న గ్రామాలలో నివసించే ఆదివాసీలు ద్రోక్పాస్ల గురించి పెద్ద విషయాలే చెప్పు కోవచ్చు. విషాదమేమిటంటే ఇప్పుడు వారి జనాభా రెండు వేల అయిదు వందలు మాత్రమే! ద్రోక్పాస్లు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా... ఎన్నో ఆదివాసుల తెగలు ప్రమాదం అంచున ఉన్నాయి. తన మిత్రుడు ఒక రోజు, ప్రమాదకర స్థితిలో ఉన్న ఆదివాసి తెగల గురించి చెప్పినప్పుడు బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జిమ్మి నెల్సన్ ఆశ్చర్యపడ్డాడు. ఆ ఆశ్చర్యానికి దుఃఖం కూడా తోడైంది. ‘బిఫోర్ దే పాస్ అవే’ అనుకున్నాడేమో భుజానికి కెమెరా తగిలించుకొని ప్రపంచం మొత్తం తిరిగాడు. అది మామూలు కెమెరా కాదు...యాభై ఏళ్ల ‘ప్లేట్ ఫిల్మ్ కెమెరా’ అద్భుతమైన స్పష్టత దాని సొంతం. ‘‘వారి దగ్గర డబ్బులేక పోవచ్చుగానీ చాలా సంపన్నులు. ఈ విషయాన్ని ఆధునిక ప్రపంచానికి చాటడానికి బిఫోర్ దే పాస్ అవే... ప్రాజెక్ట్ చేపట్టాను. డబ్బుతో కొలవలేని గొప్ప సంస్కృతి వారి సొంతం’’ అంటాడు నెల్సన్. ‘బిఫోర్ దే పాస్ అవే’ ఫొటో సిరీస్‌లో ఫొటోలు మాత్రమే కాదు...కన్నీటి తడి కూడా కనిపిస్తుంది. ఆర్ట్ ఎటాక్! సమ్‌థింగ్ స్పెషల్ విక్టర్ గీసే బొమ్మలు ఆహా అనిపించడంతో పాటు నోరూరిస్తాయి. అరవై అయిదు సంవత్సరాల ఈ బ్రెజిల్ ఆర్టిస్ట్ నట్స్, గ్రేప్స్, బేబికార్న్...మొదలైన వాటిని ఉపయోగించి బొమ్మలు గీస్తుంటాడు. తన కళకు ప్రత్యామ్నాయ కళ అని కూడా పేరు పెట్టుకున్నాడు. కొందరేమో ‘ఆర్ట్ ఎటాక్’ అని సరదాగా పిలుస్తారు. గతంలో ఆర్ట్ డెరైక్టర్‌గా పని చేసిన విక్టర్ ‘‘నా బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలను అలరిస్తున్నాయి’’ అని మురిసిపోతు న్నాడు. బిస్కట్లతో రూపొందించిన బొమ్మలకైతే భలే క్రేజు. ఈ బొమ్మలను తన ఫేస్బుక్ పేజీలో పెట్టినప్పుడు మంచి స్పందన వచ్చింది. కొందరు వీటి నుంచి స్ఫూర్తి పొంది తాము కూడా తయారుచేయడం మొదలెట్టారు. అందుబాటులో ఉండే పదా ర్థాలు, వస్తువులను ఉపయోగించి బొమ్మలు గీయడానికి ప్రాధా న్యత ఇస్తాడు విక్టర్. డిష్ క్లాత్స్, ఫ్లోర్ క్లాత్స్...ఇలా ఏవైనా సరే. సాధారణ వస్తువులతో అసాధారణమైన చిత్రాలను సృష్టించడం తన పని అని చెబుతాడు. ‘‘మనసు బాగ లేనప్పుడు... బొమ్మలు గీస్తాను. వాటిని చూస్తే కొత్త ఉత్సాహం వస్తుంది. నా ఆర్ట్ నాకు థెరపీలాగా పని చేస్తుంది’’ అంటున్నాడు విక్టర్. యుద్ధంలో గెలిస్తేనే... లైఫ్ బుక్- కత్రినా కైఫ్ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోకపోతే ఆరోజు వృథా అయిపోయినట్లు అనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోకపోతే సరికొత్తగా ఏమీ చేయలేం. నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలను పక్కనపెట్టడం కాకుండా వాటిని తగిన సందర్భాలలో అన్వయించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ఒక కెరీర్‌ను ఎంచుకున్నామంటే... నిరంతరం మనతో మనం యుద్ధం చేయడమే. ప్రతికూలత అనే శత్రువులను ఆ యుద్ధంలో సంహరించడం మీదే కెరీర్లో మన విజయం ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో పెరగలేదు, హిందీ రాదు...ఇవి నాకు మైనస్ పాయింట్లుగా నిలిచాయి. ఈ దేశంలో మళ్లీ పెరిగే అవకాశం లేకపోవచ్చుగానీ హిందీ నేర్చుకునే అవకాశం మాత్రం ఉందిగా. ఈ పని కోసం కష్టపడ్డాను. విమర్శ అనేది బాధ పెట్టవచ్చుగాక...కానీ దాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి మంచిగా మాట్లాడడం అనేది అరుదు. ‘ఇది లోకనైజం’ అని అన్ని విమర్శలనూ ఒకే గాటన కట్టలేం. కొన్ని విమర్శలు మన విజయానికి మెట్లలాంటివి. కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తాడు! మన జాతీయాలు ‘టీలు తాగారా... టిఫిన్లు చేశారా?’ ‘అరే... ఎక్కడ చచ్చార్రా... ఇక్కడ ఒక్కడూ లేడూ’ ‘అది ఇలా కాదు... ఇలా చేయండి’ ఇలాంటి డైలాగులు మన నిత్యజీవితంలో ఎన్నోచోట్ల వినబడుతుంటాయి. హడావిడి ఎక్కువ చేసి, పనేమీ చేయని వాళ్లు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసమే పుట్టిన జాతీయం- ‘కుండల్లో గుర్రాలు’ తాము ఏమాత్రం పని చేయకుండా ఇతరులను తెగ హడావిడి పెట్టేవాళ్లను ‘‘అబ్బో... కుండల్లో గుర్రాలు పరుగెత్తిస్తున్నాడు’’ అనో ‘‘ఏమీ చేయలేడు...కుండల్లో గుర్రాలు పరుగెత్తించడంలో మాత్రం సిద్ధహస్తుడు’’ అంటుంటారు. గుర్రాలను ఎక్కడ పరుగెత్తిస్తారు? రోడ్డు మీదో, ఊరి బయటో. మరి కుండల్లో పరుగెత్తిస్తారా ఎవరైనా! వంట గురించి ఏమీ తెలియకపోయినా వంటగదిలో దూరి ‘అలా చేయాలి ఇలా చేయాలి’ అని ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ల విషయంలోనూ ఇది ఉపయోగిస్తారు. -
దేశ ఆర్థిక ఇబ్బందులు తీరే కల!
ఉత్తరప్రదేశ్‌లోని దౌండి యాఖేరా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన ఊరు. ఇక్కడ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిధి వేట గురించి అందరూ ఎంతో ఆసక్తితో గమనిస్తున్నారు. ఈ వేట వెనుక ఒక స్వామీజీ కల ఉంది. ఆసక్తికరమైన కథ ఉంది. ఆయన పేరు స్వామి శోభన్సర్కార్. చాలా సంవత్సరాల కిందటే సన్యాసాన్ని స్వీకరించారు. బస ఒక పాడుబడిన గ్రామ సమీపంలోని ఆలయంలో. ఇటీవల తనకు కలలో ఒక నిధి రహస్యం తెలిసిందని ఆయన వెల్లడించడంతో స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి నిధివేట మొదలుపెట్టింది! కొంతమంది దీన్ని జోక్‌గా తీసుకొంటున్నారు. ఆ స్వామీజీ ఎవరో గానీ నోటికొచ్చింది చెబితే మాత్రం ఇలా నిధివేటకు పూనుకోవడం ఏమిటని ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇంతకీ ఈ విషయంపై స్వామీజీ ఏమంటున్నారు? ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుండటం నన్ను చాలా బాధించింది. ఈ విషయంలో ప్రధానమంత్రి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆందోళన చెందుతుండటాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. నా గురువులు భాస్కరానందజీ, సత్సంగానందజీలు నాకు కలలో కనిపిస్తే వారితో ఈ విషయం గురించి ప్రస్తావించాను. వారు దౌండి యా ఖేరాలోని ఓ సమాధి సమీపంలో నిక్షిప్తమై ఉన్న గుప్త నిధి గురించి సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో నేను ప్రధానమంత్రికి ఈ నిధి గురించి లేఖ రాశాను. నిధి దొరకడం ఖాయం.. దేశానికి కష్టాలు తొలగడం ఖాయం...’’ అని స్వామిజీ హామీ ఇస్తున్నారు. దాదాపు నెల కిందట ఈ బాబా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఒక లేఖ రాశారు! తనకు ఒక నిధి సమాచారం గురించి తెలుసునని, తాను చెప్పిన చోట తవ్వితే రెండు వేల టన్నుల బంగారం దొరుకుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ లేఖను నిర్లక్ష్యం చేయలేదు! ఎవరో పనిలేని వ్యక్తి ఇలాంటి లేఖ రాశాడని వారు దాన్ని పక్కన పడేయలేదు. బహుశా.. కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన భారీ నిధి ప్రభావం కాబోలు... ఎందుకైనా మంచిదన్నట్టుగా బాబా ఉంటున్న ప్రాంతంలోని ప్రభుత్వాధికారులను అప్రమత్తం చేశారు. ఆ కథేంటో తెలుసుకొమ్మని పురమాయించారు. ఇక్కడ నుంచి కథ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ఇండియా (ఏఎస్ఐ) నిపుణులు ఆగమేఘాల మీద దౌండియా చేరుకొన్నారు. స్వామిజీని కలిసి.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నిధి అన్వేషణ మొదలుపెట్టారు. కండిషన్లున్నాయి... ఈ నిధి గురించి సమాచారం ఇచ్చిన బాబా కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఈ నిధి విషయంలో తనకు, తమ గురువులకు సరైన ప్రాధాన్యతను ఇవ్వకపోతే.. అంతే సంగతులు అని ఆయన అంటున్నారు. తమ గురువుల అనుమతి లేనిదే ఎవరూ ఈ నిధిని టచ్ కూడా చేయలేరని, ఇంతేగాక ప్రభుత్వం తన సూచనలు పాటిస్తే.. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా బలపడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఈ నిధి విషయంలో స్వామిగారి కల నిజమైతే.. ఈయన ప్రత్యక్ష దైవమే అవుతాడేమో...! -
అంగారకుడిపైకి వన్ వే టికెట్!
శాస్త్రవేత్తల అంచనాలే తప్ప సాధారణ మనిషి ఊహకందని వాతావరణ పరిస్థితులు! గ్రహాంతరవాసులే ఉంటారో, బతుకు గమనమే మారిపోతుందో తెలీదు. అసలు అక్కడ అడుగుపెట్టడమైనా సాధ్యమవుతుందా అనేదే అతిపెద్ద అనుమానం! అయినా సరే, ‘అంగారకుడి పైకి వస్తారా?’ అని అడిగింది ఆలస్యం... ‘మేము రెడీ’ అంటూ... ఏకంగా రెండు లక్షల మంది ఉత్సాహవంతులు అప్లికేషన్లు వేశారు. తాము భూమిని విడిచి అరుణగ్ర హం రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఈ ప్రయత్నంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని పేర్కొంటూ హామీ పత్రాలు రాసిచ్చారు. అంగారకుడి పైకి వన్ వే టికెట్ కొనుక్కోవడానికి అమితాసక్తి చూపించారు. సంగతేమంటే... డచ్‌కు చెందిన ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ 2016 కల్లా అంగారకుడి పైకి మనిషిని పంపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకు సంబంధించి అంతరిక్ష నౌకలను సిద్ధం చేస్తున్న ఈ సంస్థ అందులో ప్రయాణించడానికి, భూమిని శాశ్వతంగా వదిలి అంగారకుడిపై సెటిలవ్వడానికి 24 మందిని సెలక్ట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం దర ఖాస్తులను ఆహ్వానిస్తే ఏకంగా రెండు లక్షలమంది నుంచి అవి వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ దరఖాస్తు దారుల్లో 165 దేశాలకు చెందినవారు ఉన్నారు. వీరిలోంచి అనేక దశలుగా, అనేక షరతులతో 24 మందిని సెలక్ట్ చేయడానికి ఆ సంస్థ రెడీ అవుతోంది. ఈ ‘మార్స్ మిషన్’ దరఖాస్తుదారులకు ఎలాంటి మిలటరీ ట్రైనింగ్ ఉండదని, వారికి ఫ్లయింగ్ విషయంలో ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదని, కనీసం సైన్స్ డిగ్రీ కూడా అవసరం లేదని ఆ అంతరిక్ష సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే అభ్యర్థికి కనీసం వయసు 18 సంవత్సరాలని, అతడు శారీరకంగా, మానసికంగా చక్కటి ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు. క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఇంతకుమించి ప్రత్యేక నైపుణ్యాలేవీ కూడా అవసరం లేదన్నారు. భూమి తర్వాత మానవ ఆవాసానికి అరుణగ్రహం మీదే అంతో ఇంతో అనుకూలమైన పరిస్థితులున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి ఈ అరుణగ్రహ యాత్ర ఏ మేరకు కార్యరూపం దాలుస్తుందనేది వేచి చూడవలసిన విషయం.