![సమ్‌థింగ్ స్పెషల్ సంక్రాంతి](/styles/webp/s3/article_images/2017/09/5/61484157517_625x300.jpg.webp?itok=ezFo0Jev)
సమ్‌థింగ్ స్పెషల్ సంక్రాంతి
నిర్మల్‌రూరల్ :
‘వావ్.. సంక్రాంతి ఫెస్టివల్.. సమ్‌థింగ్ స్పెషల్ హై..’ అంటూ నాగాలాండ్‌వాసులు సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని వాసవి పాఠశాలలో ఉపాధ్యాయినులుగా బోధిస్తున్న నాగాలాండ్‌వాసులు మంగళవారం స్కూల్లో నిర్వహించిన సంబురాల్లో పాలుపంచుకున్నారు.
రంగుల ముగ్గులు వేస్తూ ఆటపాటల్లో పాల్గొన్నారు. బోగిమంటలు, గంగిరెద్దుల ఆటలను ప్రత్యేకంగా గమనించారు. గంగిరెద్దులతో కలిసి ఫొటోలూ దిగారు.