ఈ ఏడాది అక్టోబర్ మాసానికి చాలా ప్రత్యేకత ఉందండోయ్.
ఈ ఏడాది అక్టోబర్ మాసానికి చాలా ప్రత్యేకత ఉందండోయ్... అదేమంటారా? అయితే మీరే చూడండి.... ఈ అక్టోబర్‌లో ఐదేసి చొప్పున శని, ఆది, సోమవారాలు వస్తాయి. అంతేకాదండోయ్! ఈ నెలలో వచ్చే పౌర్ణమి (16), అమావాస్య(30) రెండూ ఆదివారమే కావడం విశేషం.
ఇక ఈ మాసమంటరా... పిల్లలకు బోల్డన్ని సెలవులను మోసుకొస్తోంది. పండుగలతో ఉత్సాహాన్ని నింపబోతోంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళితే... ఇలాంటి నెల 803 సంవత్సరాల కిందట అంటే 1153లో మాత్రమే వచ్చినట్లు ప్రముఖ న్యూమరాలజిస్ట్ కొడేకండ్ల నాగభూషణరావు అంటున్నారు. ఔను కదా! అక్టోబర్–16 అంటే నిజంగా సమ్‌థింగ్ స్పెషలే మరీ...