
కాటన్ బాల్ కాదు... భౌ భౌవే!
సమ్‌థింగ్ స్పెషల్
తెల్లటి మేఘమా? లేనిచో దూది బంతియా?... టోరీని చూడగానే ఇలా కవిత్వం అల్లే వాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువయ్యారు. ఎవరీ టోరీ? ఏమా కథ? సౌత్ కొరియాలోని డాగులో యజమానుల ఇంట్లో ఉండే బికాన్ జాతీ పప్పీ పేరు టోరీ. పెద్ద తలకాయ ఉండడమే మన టోరీ ప్రత్యేకత. యజమానులు టోరీ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో... టోరీ హీరో అయిపోయింది. టోరీకి ప్రపంచ వ్యాప్తంగా 64,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.