అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. | something special in kobama high school | Sakshi
Sakshi News home page

అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..

Published Wed, Nov 4 2015 3:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..

అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..

టోక్యోలోని ప్రముఖ పాఠశాల కొమాబా హైస్కూల్లో ‘మిస్ కొమాబా’ అందాల పోటీ జరుగుతోంది.

టోక్యోలోని ప్రముఖ పాఠశాల కొమాబా హైస్కూల్లో ‘మిస్ కొమాబా’ అందాల పోటీ జరుగుతోంది. అందగత్తెలంతా బారులు తీరారు. తుది రౌండ్ అనంతరం సూపర్‌గా ఉన్న ఓ అమ్మాయికి మిస్ కొమాబా కిరీటధారణ చేశారు. రోటీనేగా.. ఇందులో సంథింగ్ స్పెషలేముంది అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ ఉంది. ఈ ఏడాది మిస్ కొమాబా టైటిల్ గెలిచింది ఓ అబ్బాయి! ఈ ఏడాది కాదు.. ప్రతి ఏడాదీ ఇక్కడ ఈ టైటిల్ గెలిచేది అబ్బాయిలే!!

ఎందుకంటే.. ఇది అబ్బాయిలు మాత్రమే చదివే స్కూలు కాబట్టి.. కొమాబా హైస్కూల్ కొన్నేళ్లుగా ఈ వినూత్నమైన అందాల పోటీని నిర్వహిస్తోంది. అబ్బాయిలు అచ్చంగా అమ్మాయిల్లా తయారై.. ఈ పోటీలో పాల్గొంటారు. ఇదేదో అషామాషీ వ్యవహారంలా ఉండదు. వీళ్లు అమ్మాయిలే అసూయపడేంత అందంగా తయారవుతారు. ఫొటోలు చూడండి.. మీకే అర్థమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement