అబ్బాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా..
టోక్యోలోని ప్రముఖ పాఠశాల కొమాబా హైస్కూల్లో ‘మిస్ కొమాబా’ అందాల పోటీ జరుగుతోంది. అందగత్తెలంతా బారులు తీరారు. తుది రౌండ్ అనంతరం సూపర్‌గా ఉన్న ఓ అమ్మాయికి మిస్ కొమాబా కిరీటధారణ చేశారు. రోటీనేగా.. ఇందులో సంథింగ్ స్పెషలేముంది అని మీరు అనుకోవచ్చు. స్పెషల్ ఉంది. ఈ ఏడాది మిస్ కొమాబా టైటిల్ గెలిచింది ఓ అబ్బాయి! ఈ ఏడాది కాదు.. ప్రతి ఏడాదీ ఇక్కడ ఈ టైటిల్ గెలిచేది అబ్బాయిలే!!
ఎందుకంటే.. ఇది అబ్బాయిలు మాత్రమే చదివే స్కూలు కాబట్టి.. కొమాబా హైస్కూల్ కొన్నేళ్లుగా ఈ వినూత్నమైన అందాల పోటీని నిర్వహిస్తోంది. అబ్బాయిలు అచ్చంగా అమ్మాయిల్లా తయారై.. ఈ పోటీలో పాల్గొంటారు. ఇదేదో అషామాషీ వ్యవహారంలా ఉండదు. వీళ్లు అమ్మాయిలే అసూయపడేంత అందంగా తయారవుతారు. ఫొటోలు చూడండి.. మీకే అర్థమవుతుంది.