కత్రినా కైఫ్ (అ)యిష్టాలు లివింగ్ రిలేషన్‌షిప్ అంటే ఇష్టం!
కత్రినా కైఫ్ (అ)యిష్టాలు
ఇప్పుడున్న బాలీవుడ్ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ సమ్‌థింగ్ స్పెషల్‌గా అనిపిస్తారు. కేవలం గ్లామర్ డాల్... ఐటమ్ గాళ్ అనుకున్న కత్రినా తనకంటూ ఓ సెపరేట్ స్టేటస్ తెచ్చుకున్నారు. ఓపెన్‌గా మాట్లాడటాన్ని లైక్ చేసే కత్రినా చెప్పిన లైక్స్, డిస్‌లైక్స్..
ఇష్టాలు
►: బేబీ పింక్ కలర్ అంటే కత్రినాకు బోల్డంత ఇష్టం. స్కై బ్లూ, రెడ్ కలర్స్ అంటే కూడా మక్కువ.
►: లివింగ్ రిలేషన్‌షిప్ అంటే ఇష్టం. జీవితానికి సో స్పెషల్ అనిపించే వ్యక్తితో సహజీవనం చేయడానికి వెనకాడరు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో సహజీవనం చేస్తున్నారట.
►: పాపులార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం. మోడల్‌గా చేయడానికీ, సినిమాల్లోకి రావడానికీ అదో కారణం.
►: ఆడి కార్ అద్భుతం అంటారు.
► : ఓపెన్‌గా మాట్లాడేవాళ్లను లైక్ చేస్తారు.
► : వెడ్డింగ్ డ్రెస్ ఇష్టం. అందుకు పూర్తి భిన్నంగా ఉండే బికినీ అంటే చాలా చాలా ఇష్టం.
► : బ్లాక్ కాఫీ బాగా అలవాటు. ఇండియన్స్ తినేట్లు పెరుగన్నం తినడం ఈ విదేశీ భామకు ఇష్టం.
►: ప్రముఖ నవలా రచయిత సిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకాలు తెగ చదువుతారు.
►: స్పోర్ట్స్‌లో క్రికెట్, చెస్ అంటే ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా చెస్ ఆడుతుంటారు. అడపా దడపా క్రికెట్ కూడా ఆడతారు. కత్రినా ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ‘ఇర్ఫాన్ పఠాన్’.
►: హాలీవుడ్ స్టార్స్ లియొనార్డొ డికాప్రియో, జానీ డెప్, బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ అంటే ఇష్టం.
అయిష్టాలు
►: నర్మగర్భంగా మాట్లాడేవాళ్లంటే అసహ్యం. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటారు.
►: ఫలానా హీరోతో పెళ్లయ్యిందంటూ తన గురించి వచ్చే వార్తలను ఇష్టపడరు.
►: మేకప్ అంటే చిరాకు. అందుకే షూటింగ్స్ లేనప్పుడు దాని జోలికి వెళ్లరు. ‘రాజ్‌నీతి’ చిత్రానికి తక్కువ మేకప్ చాలని చిత్రదర్శకుడు ప్రకాశ్ ఝా చెప్పినప్పుడు తెగ ఆనందపడ్డారట.
► : ఎదుటి వ్యక్తుల్లో అదే పనిగా తప్పులు వెతికేవాళ్లను ఆమడ దూరంగా ఉంచేస్తారు.
► : రణ్‌బీర్ కపూర్ గాళ్ ఫ్రెండ్ కత్రినా అని ఎవరైనా అంటే అస్సలు ఇష్టపడరు. నాకంటూ ఓ పేరు ఉంది కదా అంటారు. జనరల్‌గా కత్రినాని ముద్దుగా ‘కాట్’ అని పిలుస్తుంటారు. అలా పిలిస్తే ఆమెకు నచ్చదు.
► :హర్రర్ సినిమాలంటే అయిష్టం. అందుకని వీలైనంత వరకూ అలాంటి చిత్రాలు చూడరు.
► : మీడియావాళ్లు పర్సనల్ లైఫ్ గురించి అడగడం ఇష్టపడరు.
► : అతిగా వాగడం నచ్చదు. ఉదాహరణకు ఉదయం షూటింగ్‌కి లొకేషన్‌కి వెళ్లాక సరిగ్గా ముగ్గురికి ‘గుడ్ మార్నింగ్’ చెప్పడంతోనే అసహనం వచ్చేస్తుందట.
► : స్పైసీ ఫుడ్ నచ్చదు. అందుకని ఇండియా వచ్చిన తొలి రోజుల్లో చాలా కష్టంగా ఉండేదట. ఇప్పటికీ స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉంటారు.
► : ఆడవాళ్లను గౌరవించని మగవాళ్లంటే అసహ్యం. అమ్మాయిలకు ఆంక్షలు పెట్టేవాళ్లంటే మంట.