సమ్‌థింగ్ స్పెషల్ | Something special: Pot crop to planting a craze in City | Sakshi
Sakshi News home page

సమ్‌థింగ్ స్పెషల్

Published Wed, Sep 3 2014 4:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

సమ్‌థింగ్ స్పెషల్

సమ్‌థింగ్ స్పెషల్

ఇంటి పరిసరాల్లో పచ్చదనం పరవాలని ఎవరికి ఉండదు! కానీ... కాంక్రీట్ జంగిల్... అపార్ట్‌మెంట్ కల్చర్‌లో వుట్టి నేల వూట ఎలా ఉన్నా... కాస్త ఖాళీ కనిపించే పరిస్థితి ఎక్కడుంది! అరుుతే బాల్కనీ... లేదంటే పోర్టికో... ఇంతకు మించి మొక్కలు పెంచడానికి స్థలం దొరకదు. అందుకే కుండీల్లో పంటకు సిటీలో వూంచి క్రేజ్. ఉన్నదాంట్లోనే పూలు, ఆకు కూరల వంటివి పండించేస్తున్నారు చాలా వుంది. వురి వుర్రి వంటి పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవాలంటే..! అమ్మో.. అదెలా సాధ్యవునేగా! ఆ కోరిక తీర్చుకోవచ్చంటున్నారు నర్సరీ నిర్వాహకులు. కొనుగోలుదారుల ఆసక్తి, ఆకాంక్షకు తగినట్టుగా ప్రయోగాలు చేస్తున్నారు. వివిధ మొక్కలను అభిరుచికి తగినట్టుగా కుండీల్లో అలంకరించి ఇచ్చే నయూ పద్ధతికి శ్రీకారం చుట్టారు. వుర్రి లాంటి భారీ జాతుల వృక్షాలను సైతం బోన్సాయి వృక్షాలుగా మార్చి అందంగా తీర్చిదిద్దుతున్నారు. హాలు, బాల్కనీల్లో పెట్టుకోవడానికి వీలుగా వీటిని రూపొందిస్తున్నారు.  వీటితో పాటు రకరకాల మొక్కలను విభిన్నంగా అలంకరించి అందిస్తున్నారు. చెట్టు కాండాన్ని తొలిచి ఇలా అలంకరిస్తారు. దీనిపై కావల్సిన రంగుతో పాటు డిజైన్ కూడా వేస్తారు. స్థలం కాస్త ఎక్కువగా ఉండే ఇళ్ల కోసం ఈ వెరైటీలు
 
 స్టేటస్ సింబల్...
 కుండీల్లో భారీ చెట్లను పెంచుకోవడం సమ్‌థింగ్ స్పెషలే కాదు... స్టేటస్ సింబల్‌గా భావించేవారు సిటీలో చాలావుందే ఉన్నారు. వారి అభిరుచికి తగినట్టుగా పది నుంచి ఇరవై మర్రి మొక్కలను తొట్లలోనే లతలుగా అల్లుతున్నాం. మొక్కలను బట్టి రూ.1,500 నుంచి రూ.2,000 వరకు ఖర్చవుతుంది. ఇలా వూ నర్సరీలో 1,500కు పైగా వెరైటీ మొక్కలు అందుబాటులో ఉన్నాయుని చెబుతున్నారు కొంపల్లి సమీపంలోని
 ‘గ్రోమోర్ ఫుడ్ నర్సరీ’ నిర్వాహకుడు ప్రవీణ్ సత్యార్థి.
 -  కె.యుశ్వంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement