![Bird Smashes flight Windshield Pilot Soaked in Blood - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/16/pilot-driveing.jpg.webp?itok=eXWVleX_)
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు.
మొహమంతా రక్తం..
లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
రాబందు జాతి పక్షి..
అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp
— Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023
ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట!
Comments
Please login to add a commentAdd a comment