చెట్లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వృక్షం ఏదో తెలుసా? అది ఎక్కడ ఉంది? ఈ జాబితాలో ఇంకేమి వృక్షాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైపెరియన్, కోస్ట్ రెడ్‌వుడ్
కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైపెరియన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు. దీని సగటు ఎత్తు 360 అడుగులు. ఈ చెట్టు 16 అడుగులు (4.94 మీటర్లు) కంటే అధిక వ్యాసాన్ని కలిగి ఉంటుంది. హైపెరియన్ రెడ్‌వుడ్‌కు 600 నుంచి 800 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని అంచనా. హైపెరియన్ కోస్ట్ రెడ్‌వుడ్‌లు 2,000 సంవత్సరాలకు పైగా భూమిపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2006లో క్రిస్ అట్కిన్స్ , మైఖేల్ టేలర్ అనే ప్రకృతి శాస్త్రవేత్తలు హైపెరియన్‌ను కనుగొన్నారు.
మేనరా, ఎల్లో మెరంటీ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉష్ణమండల వృక్షం మేనరా. ఇది మలేషియా బోర్నియోలోని సబాలోని డానుమ్ వ్యాలీ పరిరక్షణ ప్రాంతంలో ఉంది. దాని ఖచ్చితమైన ఎత్తుపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఈ వృక్షం ఎత్తును 331 అడుగులు (100.8 మీటర్లు)అని గుర్తించారు. మేనరా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యాంజియోస్పెర్మ్ లేదా పుష్పించే మొక్కగా ప్రసిద్ధి చెందింది.
సెంచూరియన్, మౌంటైన్ యాష్
సెంచూరియన్ అనేది 330 అడుగుల (100.5 మీటర్లు) ఎత్తులో 13 అడుగుల (4.05 మీటర్లు) ట్రంక్ వ్యాసంతో కూడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియాలోని ఆర్వ్ లోయలో ఈ వృక్షాల కారణంగా చెలరేగిన టాస్మానియన్ బుష్‌ఫైర్‌ల వల్ల ఈ ద్వీప భూభాగంలో దాదాపు మూడు శాతం అంటే 494,210 ఎకరాలు (200,000 హెక్టార్లు) కాలిపోయింది.
డోర్నర్ ఫిర్, కోస్ట్ డగ్లస్ ఫిర్
డోర్నర్ ఫిర్‌ను ఒరెగాన్ కోస్ట్ రేంజ్‌లోని బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ సంరక్షిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డగ్లస్ ఫిర్. భూమిపై ఉన్న అత్యంత ఎత్తయిన నాన్ రెడ్‌వుడ్ వృక్షం. 327 అడుగుల (99.7 మీటర్లు) ఎత్తుతో, 11.5 అడుగుల (3.5 మీటర్లు) వ్యాసంతో ఇది చూపరులను ఆకట్టుకుంటుంది. 1989లో ఈ భారీ వృక్షాన్ని కనుగొన్నారు.
రావెన్స్ టవర్, సిట్కా స్ప్రూస్
రావెన్స్ టవర్ అనేది 317 అడుగుల (96.7 మీటర్లు)ఎత్తు కలిగివుంటుంది. సిట్కా స్ప్రూస్ 2001లో దీనిని కనుగొన్నారు. అతను హైపెరియన్, హీలియోస్, ఐకారస్ లాంటి ఇతర పొడవైన చెట్లను కూడా కనుగొన్నాడు. రావెన్స్ టవర్ ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రైరీ క్రీక్ రెడ్‌వుడ్స్ స్టేట్ పార్క్‌లో ఉంది.
జెయింట్ సీక్వోయా
కాలిఫోర్నియాలోని జెయింట్ సీక్వోయాస్ పొడవైన వృక్షాలుగా పేరొందాయి. సీక్వోయా నేషనల్ ఫారెస్ట్‌లో 314-అడుగుల (95.7 మీటర్లు) ఎత్తుతో ఈ వృక్షం ఉంది. జెయింట్ సీక్వోయాస్ 25 అడుగుల (7.7 మీటర్లు) వ్యాసంతో దృఢమైన ట్రంక్‌ను కలిగి ఉంటుంది.
వైట్ నైట్, మన్నా గమ్
టాస్మానియాలోని ఎవర్‌క్రీచ్ ఫారెస్ట్ రిజర్వ్‌లోని మన్నా గమ్ (యూకలిప్టస్ విమినాలిస్) వృక్షం కనిపిస్తుంది. దీని ఎత్తు 299 అడుగులు (91 మీటర్లు). ఈ చెట్లు కలిగిన ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. కాగా ఆఫ్రికాలో పొడవైన చెట్ల జాతులు లేవు అయితే మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్‌లో 267 అడుగుల (81.5 మీటర్లు) ఎత్తు కలిగిన ఎంటాండ్రోఫ్రాగ్మా ఎక్సెల్సమ్ వృక్షం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment