ఆటో బోల్తా: 8 మందికి గాయాలు
-
ఒకరి పరిస్థితి విషమం
వెంకటగిరిరూరల్/డక్కిలి : మరికొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకుంటున్న సమయంలో ప్రమాదంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన డక్కిలి మండలం నాగలపాడులో బుధవారం చోటుచేసుకుంది. నాగలపాడు గ్రామానికి చెందిన పలువురు వ్యక్తిగత పనుల నిమిత్తం వెంకటగిరికి చేరుకుని తిరిగి ఆటోలో నాగలపాడుకు బయలుదేరారు. నాగలపాడు దళితవాడ చర్చి మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆగ్రామానికి చెందిన రత్నయ్య, కృష్ణమ్మ, ఈశ్వరయ్య, పుల్లయ్య, చంద్రయ్య, సుశీలమ్మ, రా«ద తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రత్నయ్య, ఈశ్వరయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.