
సాక్షి, నెల్లూరు : వెంకటగిరిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రను వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన ద్రోహి.. కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నల్లజెండాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు తమ రాష్ట్రంలో తిరగొద్దంటూ.. ప్రత్యేక హోదా భరోసా యాత్ర బస్సును అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య లోపులాట చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment