వెయ్యి మందితో బందోబస్తు
-
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ
వెంకటగిరి:
పోలేర మ్మజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్ గున్నీ తెలిపారు. శుక్రవారం ఆయన జాతర జరిగే ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, మరో 200 మందిని ఎమర్జెన్సీ దళాలుగా వినియోగిస్తామన్నారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య, క్యూలైన్లు నిర్వాహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. అంతకు మందు దేవస్థానం వద్ద ఏర్పాటు చేయనున్న బారికేడ్ల మ్యాప్ పరిశీలించి ఏఈ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ట్రయిల్ బారికేడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలేరమ్మకు పూజలు
అనంతరం పోలేరమ్మకు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుడు తాండవ చంద్రారెడ్డి ఎస్పీకు శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతుశారద, గూడూరు డీఎస్సీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి పాల్గొన్నారు.