poleramma jatara
-
పోలేరమ్మ తల్లీ.. మన్నించవా
వెంకటగిరి (సైదాపురం): తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరలో ఆది నుంచి అన్నీ తప్పిదాలతో ముగిసింది. సాక్షాతు ఆశాఖ మంత్రే జాతర వైఫల్యం జరిగిందంటూ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. స్థానిక ప్రజాప్రతినిదే తమను మన్నించాలంటూ..క్షమాపణలు కోరారు. గతేడాది వైభవంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జన జాతర అన్నీ హంగులు, ఆర్భాటాలతో నిర్వహించారు. అప్పట్లో 2 రోజులు జరిగే జన జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి నేదురుమల్లి పర్యవేక్షణలో గతేడాది 5రోజుల పాటు ప్రతిరోజు పండుగగానే జాతరను నిర్వహించారు. ఆ ఏడాదిలోనే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం మహా అద్భుతంగా జరిగేందుకు వీఐపీ క్యూ దర్శనాలు నిలిపివేశారు. ఈ ఏడాది దర్శన భాగ్యం సామాన్యులకు మాత్రం నిరాశే మిగిలింది. ఈ ఏడాది తప్పిదాలు ఇలా..ఘటోత్సవంలో గత దశబ్దాలు ఆనవాయితీగా వస్తోన్న రాజా కుటుంబీకులు సాంగ్యం, అమ్మవారి బలి దున్నపోతుకు పూజలు ఈ ఏడాది నోచుకోలేదు. వాస్తవానికి అమ్మవారి ఘటం కుండలతోపాటు దున్నపోతును జీనుగుల వారి వీధినుండి ఊరేగిస్తూ రాజాగారి వంటశాల వద్ద రాజాలు పంపిన సాగ్యంతో తొలుత పూజలు నిర్వహించడ ఆనవాయితీ. ఈ ఏడాది జరిగిన ఘటోత్సవంలో రాజాగారి వంటæ శాలవద్దకు పోలేరమ్మతల్లి దున్నపోతును తీసుకురాకపోవడంతో అక్కడ దున్నపోతు ప్రత్యేక పూజలకు నోచుకోలేదు. గతేడాది సామాన్య భక్తులకోసం వీఐపీ దర్శనం పూర్తిగా రద్దుచేశారు. ఈ ఏడాది స్థానిక ప్రత్యేక వీఐపీ దర్శన క్యూ ఏర్పాటు చేయడంతో టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. -
తిరుపతి : పోలేరమ్మ నగరోత్సవం..కిక్కిరిసిన వెంకటగిరి (ఫొటోలు)
-
తిరుపతి జిల్లా వెంకటగిరి లో పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
డప్పు కొట్టి చెబుతున్నా!
రాజులేలిన గడ్డపై జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది. భక్తులు, స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వెంకటగిరి రాజాల ఆకాంక్షను నెరవేర్చింది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని సంకల్పించింది. ఈమేరకు నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాది కొకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. వెంకటగిరి సంస్థాన రాజులు ఏలుతున్న రోజులవి. 1917లో వెంకటగిరిలో కలరా మహమ్మారి వందలాది మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో వెంకటగిరి సంస్థానాధీశులు భారీ ఎత్తున శీతలయాగం నిర్వహించారు. మరోవైపు వెంకటగిరి నలువైపులా పొలిమేరలో గ్రామశిలలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా జాతర నిర్వహించారు. అప్పటి నుంచి వెంకటగిరి జాతర జరుగుతూనే వస్తోంది. వెంకటగిరి సంస్థానాధీశుల ఆధీనంలో జరుగుతున్న పోలేరమ్మజాతర 1992 నుంచి దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అరుదైన వేదిక వెంకటగిరి పోలేరమ్మజాతర నిమ్నవర్గాలతోపాటు జానపద కళారూపాల ప్రదర్శనకు అరుదైన వేదికగా నిలుస్తోంది. మతాలకు అతీతంగా వెంకటగిరీయులు నిర్వహించుకుంటారు. ఈ జాతరలో నిమ్నవర్గాలకు చెందిన వ్యక్తులు ముందుండి జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ జాతరకు దేశవిదేశాల్లో ఉన్న వెంకటగిరీయులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా పోలేరమ్మతల్లి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. నెరవేరిన కల వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహించాలనే స్థానికుల కల నెరవేరింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నేతన్ననేస్తం ఐదో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలేరమ్మ జాతరను వెంకటగిరీయుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు జీవో విడుదల చేస్తామని ప్రటించారు. -
తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర (ఫొటోలు)
-
దున్నపోతులతో తొక్కిస్తే అరిష్టాలు తొలగుతాయని..
కొత్తపల్లి: గ్రామానికి అరిష్టం పోవాలని, తమ కష్టాలు తీరాలని పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి పడుకుని దున్నపోతుతో తొక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం అమీనాబాద్‌లో జరిగే పోలేరమ్మ తీర్థంలో పూర్వం నుంచీ ఈ వింత ఆచారం కొనసాగుతోంది. ఆదివారం జరిగిన ఈ ఉత్సవంలో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు, గ్రామస్తులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దున్నపోతుకు పూజలు చేసి, గరగ నృత్యాల మధ్య గ్రామంలో ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా బారులు తీరి పడుకున్నారు. వెంటనే ఆ దున్నపోతును తీసుకుని ఒక భక్తురాలు పడుకున్న వారి మీదుగా నడిపించింది. భక్తులు ఇలా మూడుసార్లు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు, తమ కష్టాలు తొలగిపోతాయని వారు నమ్ముతారు. ఏటా క్రమం తప్పకుండా ఈ ఆచారాన్ని వారు పాటిస్తున్నారు. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ప్రస్తుతం ఉత్సవం అనంతరం దానిని విడిచిపెట్టేస్తున్నారు. -
రికార్డు స్థాయిలో జాతర ఆదాయం
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో జాతర ఆదాయం పెరిగింది. జాతర రోజు వర్షం కురిసినా అమ్మదర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తుల తాకిడి మాత్రం తగ్గలేదు. శక్తిస్వరూపిణి పోలేరమ్మ జాతర హుండీ ఆదాయం వివరాలను ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం వివరించారు. అంతకుముందు దేవదాయశాఖ కార్యాలయం ఆవరణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జాతరలో ప్రత్యేక దర్శనం టికెట్ రూ.100 ద్వారా రూ.5,13,700 రాగా గతేడాది జాతరలో రూ.5,02,700 వచ్చింది. ప్రత్యేక దర్శనం రూ.200 టికెట్ల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.8,46,000 రాగా గతేడాది రూ.7,78,400 వచ్చింది. హుండీల ద్వారా ఈ ఏడాది రూ.13,12,018 రాగా గతేడాది రూ.12,10,282 వచ్చింది. హుండీల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది రూ.1,01,737 ఆదాయం పెరిగింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.1,57,244 రాగా గతేడాది రూ.98,466 వచ్చింది. విరాళాల ద్వారా ఈ ఏడాది రూ.58,778 రాబడి వచ్చింది. మొత్తం మీద గతేడాది మొత్తం రూ.25,89,848 రాగా ఈ ఏడాది జాతరలో రూ.28,28,963 రాబడి వచ్చింది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రూ.2,39,115 రాబడి పెరిగినట్లు ఈఓ వివరించారు. ఆభరణాలు కూడా.. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరలో డొనేషన్లు, టికెట్ల ద్వారానే కాకుండా అమ్మవారి వెండి, బంగారు ఆభరణాలను సైతం భక్తులు గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో సమర్పించుకున్నారు. బంగారం గతేడాది 14.600 గ్రాములు రాగా ఈ ఏడాది 56.580 గ్రాములు భక్తులు సమర్పించారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 41.980 గ్రాముల బంగారం పెరిగింది. ఇక వెండి ఈ ఏడాది 1,896 కేజీలు రాగా గతేడాది 0.131 గ్రాములు మాత్రమే వచ్చింది. గతేడాది కంటే 1.765 కేజీల వెండి ఆభరణాలు అమ్మవారికి అధికంగా సమకూరినట్లు ఈఓ వివరించారు. చదవండి : రాజులు వేసుకున్న ఆభరణాలని చెప్పి.. -
పోలేరమ్మ జాతర ఆదాయం రూ.9.58లక్షలు
వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకు జాతర ద్వారా రూ.9.58 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది జాతర హుండీ ద్వారా 7.34 లక్షలు ఆదాయం రాగా ఈ ఏడాది రూ.9.41 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది టికెట్ల ద్వారా రూ.4.47 లక్షల రాబడి రాగా ఈ ఏడాది రూ.200 టికెట్ల అమ్మకం ద్వారా రూ.6.41 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.5.67 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ వై రామచంద్రరావు తెలిపారు. ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దుతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఈఓ వివరించారు. -
జనజాతర
-
వెయ్యి మందితో బందోబస్తు
జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెంకటగిరి: పోలేర మ్మజాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్సీ విశాల్ గున్నీ తెలిపారు. శుక్రవారం ఆయన జాతర జరిగే ప్రదేశాన్ని పరిశీలించి మాట్లాడారు. 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు, మరో 200 మందిని ఎమర్జెన్సీ దళాలుగా వినియోగిస్తామన్నారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో రోప్ పార్టీతో భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య, క్యూలైన్లు నిర్వాహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. అంతకు మందు దేవస్థానం వద్ద ఏర్పాటు చేయనున్న బారికేడ్ల మ్యాప్ పరిశీలించి ఏఈ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ట్రయిల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలేరమ్మకు పూజలు అనంతరం పోలేరమ్మకు పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యుడు తాండవ చంద్రారెడ్డి ఎస్పీకు శాలువ కప్పి సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, గూడూరు డీఎస్సీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు ఆంజనేయరెడ్డి, రహీమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
జాతర విజయవంతానికి సహకరించండి
వెంకటగిరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను విజయవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో గురువారం జాతర శాంతిసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల సూచన మేరకు జాతరలో వీఐపీ పాస్ రద్దుతోపాటు రూ.500 టికెట్‌ను రూ.250కు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలేరమ్మ నిలుపు మండపాన్ని ఈ ఏడాది సంప్రదాయ తడకలతో కాకుండా ఇనుప చట్రాలతో 8 అడుగులకు బదులు 6 అడుగులు మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మవారి దర్శనానికి ర్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నామని, క్యూలైన్లో భక్తులకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, వైఎస్సార్సీపీ నాయకుడు నెమళ్లపూడి సురేష్‌రెడ్డి, బీజేపీ నాయకుడు ఎల్.కోటీశ్వరరావు మాట్లాడారు. సంప్రదాయాలకు అనుగుణంగా జారత ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అంతకుముందు పోలేరమ్మ దేవస్థానం హుండీ ఆదాయంతోపాటు జాతర రాబడికి సంబంధించిన నగదు జమ ఖర్చుల వివరాలు సమగ్రంగా చెప్పకపోవడంతో ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారానికి దేవాదాయశాఖ కార్యాలయంలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరంరాజేశ్వరరావు, తహసీల్దార్ మైత్రేయ పి.రాజేశ్వరరావు, తాండవ చంద్రారెడ్డి, ఈవో వై.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతరలో వీఐపీ పాస్‌ల రద్దు
ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం వెంకటగిరి: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది వీఐపీ పాస్‌ల రద్దును పక్కాగా అమలు చేస్తామని, తాను సైతం రూ.500 టికెట్ కొని అమ్మవారిని దర్శించుకుంటానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లపై ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియాను సైతం అమ్మవారి దర్శనం వద్దకు అనుమతించకుండా ఆర్చి వద్ద పాయింట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. క్యూలైన్లలో వినూత్నంగా స్టీల్ బ్యారికేడ్లు, వాటికి మెష్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రాబ్యాంక్ సెంటర్ నుంచి మూడు క్యూలైన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీవీఐపీలకు పోలీస్ బందోబస్తుతో అమ్మవారి దర్శనం చేయిస్తామని వివరించారు. ఉత్సవ కమిటీ సభ్యులకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ నెల 20 నుంచే పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 18 నుంచి ప్రత్యేక జాతర వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి జాతరకు సంబంధించిన అన్ని వివరాలు, సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఆర్టీసీ డీఎం రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 120 ప్రత్యేక బస్సులను రెండు రోజుల పాటు నడుపుతామని వెల్లడించారు. జాతరలో లైటింగ్, షామియానాలు, బ్యారికేడ్లు, జనరేటర్లు, తదితర వాటిని దేవాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తామని దేవస్థాన ఈఓ రామచంద్రరావు చెప్పారు. తాగునీటి సరఫరా, పబ్లిక్ టాయ్లెట్లు, జంతు వధశాలలను ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్ తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, గూడూరు ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రవీంద్రరెడ్డి, ఎంపీపీ నక్కల మునెమ్మ, జెడ్పీటీసీ దట్టం గుర్నాథం, తహశీల్దార్ మైత్రేయ, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రహీమ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ శరత్‌బాబు, ట్రాన్స్‌కో ఏఈ జయకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
‘గిరి’లో జాతర సందడి
దేవాదాయశాఖ ఏర్పాట్లు అధికారులతో సమీక్ష నేడు నేటి అర్ధరాత్రి రెండో చాటింపు వెంకటగిరి : జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేలా దేవాదాయ ధర్మాదాయశాఖ ఏర్పాట్లును ముమ్మరం చేసింది. ఈ నెల 21,22 తేదీల్లో నిర్వహించనున్న జాతరకు సంబంధించి గత బుధవారం సంప్రదాయబద్ధంగా తొలి చాటింపు నిర్వహించగా బుధవారం అర్ధరాత్రి రెండో చాటింపు వేయనున్నారు. 18వ తేదీన ఘటోత్సవం ప్రారంభం కానుంది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పోలేరమ్మ దేవస్థానం, నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి– రాజ్యలక్ష్మి ప్రగతి కళాతోరణంగా పిలవబడే ఆర్చిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జాతరకు వచ్చి అమ్మను దర్శించుకునే భక్తులకు ఎటుంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లకు కార్యాచరణను రూపొందించేందుకు బుధవారం జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జాతరకు హజరయ్యే భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ల ఏర్పాటులో ఈ ఏడాది అనుసరించనున్న విధానాలను ఖరారు చేయనున్నారు. వృద్ధులకు, చిన్నారులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండేళ్ల క్రితం అప్పటి ఎస్పీ సెంథిల్‌కుమార్ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. జాతరలో అమ్మవారి దర్శనం ప్రారంభం కాగానే పట్టణంలోకి ద్విచక్ర వాహనాలను మినహా ఆటోలు, కారులు ప్రవేశాన్ని నిషేధించడం మంచి ఫలితాలను ఇచ్చింది. అప్పటి నుంచి అదే విధానాన్ని అవలంబిస్తున్నారు. స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడాప్రాంగణం, వీఆర్‌జేసీ ఎదురుగా ఉన్న మైదానంలో పార్కింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక ప్రధానంగా క్యూలైన్ల ఏర్పాటులో మాత్రం ఏటా అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. ఈ ఏడాది అయిన పక్కా కార్యాచరణతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మదర్శన భాగ్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఉత్సవ కమిటీ ఉత్తర్వులు లేవీ మరో వారం రోజుల్లో జాతర ప్రారంభం అవతున్నా.. ఇప్పటి వరకు దేవాదాయశాఖ నుంచి పోలేరమ్మ జాతర ఉత్సవ కమిటీ ఉత్తర్వులు స్థానిక అధికారులకు అందలేదు. జాతర ముగిసే 22వ తేదీ వరకు ఉత్సవ కమిటీ అధికారికంగా ఏర్పాట్లును పర్యవేక్షించాల్సి ఉంది. సాధారణంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే దేవస్థానం శాశ్వత కమిటీలో చైర్మన్‌తో పాటు పలువురు సభ్యులను నామినేట్ చేస్తారు. అయితే జాతర ఉత్సవ కమిటీలో చైర్మన్ గిరీకి స్థానం లేకుండా అందరూ సభ్యులుగానే ఉత్తర్వులు వెలవడనున్నట్లు తెలిసింది. శాంతిసంఘం సమావేశం రేపు జాతరను విజయవంతంగా నిర్వహించే క్రమంలో స్థానికంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, స్థానికులు ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకునేందుకు శాంతి సంఘం సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది గురువారం స్థానిక త్రిపురసుందరి కల్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధ్యక్షతన దేవాదాయశాఖ, పోలీసులు, రెవెన్యూ, అధికారులు అన్ని వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. ఇక అమ్మసేవలోభాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఈ సమావేశంలో తాము చేపట్టబోయే కార్యక్రమాలను అధికారులకు వివరించనున్నారు. గతంలో వైఫల్యాలను మననం చేసుకోని అవి పునరావృతం కాకుండా పక్కా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు -
పోలేరమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
వెంకటగిరి: జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి జాతర నిర్వాహణకు సబంధించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను సోమవారం ఆ దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద, దేవస్థానం ఈవో వై రామచంద్రరావు, తహసీల్దార్ మైత్రేయ, జెడ్పీటీసీ దట్టం గుర్నా«థం, కౌన్సిలర్ కె చెంగారావు, లాలాపేట సింగిల్‌విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని పాల్గొన్నారు. -
నేడు పోలేరమ్మజాతర తొలిచాటింపు
21, 22 తేదీల్లో జాతర వెంకటగిరిలో శుభకార్యాలు బంద్ వెంకటగిరి: జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సంబంధించి తొలిచాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన జాతరలో సంప్రదాయాలకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. జాతరకు సంబంధించి తొలిచాటు వేసిన రోజు నుంచి జాతర ముగిసేవరకూ వెంకటగిరిలో శుభకార్యాలు నిర్వహించరు. తరాలుగా వస్తున్న సంప్రదాయాలను నేటికీ ఆచరించడం విశేషం. ఈనెల 21, 22 తేదీలో నిర్వహించే జాతరకు సంబంధించి బుధవారం రాత్రి స్థానిక కాంపాళెంలో గాలిగంగుల దేవస్థానం వద్ద పూజలు నిర్వహించారు. రెండోచాటు ఈనెల 14న వినాయకచవితి తరువాత వచ్చే తొలి బుధవారం తొలిచాటు, రెండో బుధవారం రాత్రి రెండో చాటు వేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జాతరకు సంబంధించి రెండో చాటు వేయనున్నారు. అనంతరం 18వ తేదీ నుంచి పట్టణంలో ఘటోత్సవం ప్రారంభం అవుతుంది. 21వ తేదీ రాత్రి అమ్మవారి నిలుపు, 22వ తేదీన నిమజ్జనం కార్యక్రమాలతో జాతర ముగుస్తుంది.