పోలేరమ్మ తల్లీ.. మన్నించవా | poleramma jana jatara is over: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ తల్లీ.. మన్నించవా

Published Sun, Sep 29 2024 5:55 AM | Last Updated on Sun, Sep 29 2024 5:55 AM

poleramma jana jatara is over: Andhra pradesh

సవాలక్ష తప్పులతో ముగిసిన జన జాతర 

జాతర ఆది నుంచి అన్నీ తప్పిదాలే

వెంకటగిరి (సైదాపురం): తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరలో ఆది నుంచి అన్నీ తప్పిదాలతో ముగిసింది. సాక్షాతు ఆశాఖ మంత్రే జాతర వైఫల్యం జరిగిందంటూ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. స్థానిక ప్ర­జా­ప్రతినిదే తమను మన్నించాలంటూ..క్షమా­పణ­లు కోరారు. గతేడాది వైభవంగా వైఎస్సార్‌­సీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌­కు­మార్‌రెడ్డి ఆధ్వర్యంలో జన జాతర అన్నీ హంగులు, ఆర్భాటాలతో నిర్వహించారు. అప్పట్లో 2 రోజులు జరిగే జన జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి నేదురుమల్లి పర్యవేక్షణలో గతేడాది 5రోజుల పాటు ప్రతిరోజు పండుగగానే జాతర­ను నిర్వహించారు. ఆ ఏడాదిలోనే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం మహా అద్భుతంగా జరిగేందుకు వీఐపీ క్యూ దర్శనాలు  నిలిపివేశారు. ఈ ఏడాది దర్శన భాగ్యం సామాన్యు­లకు మాత్రం నిరాశే మిగిలింది. 

ఈ ఏడాది తప్పిదాలు ఇలా..
ఘటోత్సవంలో గత దశబ్దాలు ఆనవాయితీగా వ­స్తో­న్న రాజా కుటుంబీకులు సాంగ్యం, అమ్మ­వా­రి బలి దున్నపోతుకు పూజలు ఈ ఏడాది నోచుకోలేదు. వాస్తవానికి అమ్మవారి ఘటం కుండలతోపాటు దున్నపోతును జీనుగు­ల వారి వీధినుండి ఊరేగిస్తూ రాజాగారి వంటశాల వద్ద రాజాలు పంపిన సాగ్యంతో తొలుత పూజలు నిర్వహించడ ఆనవాయితీ. ఈ ఏడాది జరిగిన ఘటోత్సవంలో రాజాగారి వంటæ శాల­వ­ద్దకు పోలేరమ్మతల్లి దున్నపోతును తీసుకు­రాకపోవ­డంతో అక్కడ దున్నపోతు ప్రత్యేక పూజలకు నోచుకోలేదు. గతేడాది సామాన్య భక్తుల­కోసం వీ­ఐపీ దర్శనం పూర్తిగా రద్దుచేశా­రు. ఈ ఏడాది  స్థానిక ప్రత్యేక వీఐపీ దర్శన క్యూ ఏర్పాటు చేయడంతో టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement