
అమ్మా...పోలేరు తల్లీ.. కరుణించుమాయమ్మ..కాపాడమ్మా.. జైజైజై పోలేరు తల్లీ.. అమ్మలగన్నమ్మ మాయమ్మ...పోలేరమ్మతల్లీ.. అంటూ భక్త జనం వెంకటగిరి జాతరకు పోటెత్తింది

తెలుగురాష్ట్రాలతోపాటు, దేశ విదేశాల దారులన్నీ గిరి వైపు మళ్లాయి. వాహనాలన్నీ గిరి బాట పట్టాయి. చిన్నా, పెద్దా అందరూ అమ్మ దర్శనం కోసం వెంకటగిరికి చేరుకున్నారు

రాష్ట్ర పండుగ అయిన పోలేరమ్మ జాతరలో పాల్గొని, అమ్మను దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు



















