పోలేరమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
వెంకటగిరి:
జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి గ్రామశక్తి జాతర నిర్వాహణకు సబంధించి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను సోమవారం ఆ దేవస్థానం వద్ద స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే పోలేరమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతుశారద, దేవస్థానం ఈవో వై రామచంద్రరావు, తహసీల్దార్ మైత్రేయ, జెడ్పీటీసీ దట్టం గుర్నా«థం, కౌన్సిలర్ కె చెంగారావు, లాలాపేట సింగిల్‌విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని పాల్గొన్నారు.