
సాక్షి, కర్నూలు : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది.
రేపు ఉదయం 8 గంటలకు వెంటగిరి, కొడుమూరు కోట్ల సర్కిల్, కొడుమూరు కొత్త బస్టాండ్, వర్కూరు ఎస్సీ కాలనీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వర్కూరు నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.30 గంటలకు వేముగోడు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు. ఈమేరకు 19రోజు పర్యటన వివరాలను వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment