
'కన్నకూతురు ఉసురు తగలక తప్పదు'
బాలాయపల్లి : రెండో భార్య మెప్పు కోసం ఆడబిడ్డ అని కూడా చూడకుండా చదువుకునే వయసులో కట్టుబట్టలతో వదిలించుకుని, న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని కాజేసి తన కన్నీటికి కారణమైన తన తండ్రితో పాటు సవతి తల్లి సింధుకు తన ఉసురు తప్పదని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కవిత అన్నారు. నెల్లూరు జిల్లా యాచవరంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రావి దేవికాచౌదరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తన సవతి తల్లి సింధు ఇంట్లో పనిమనిషిని నిలిపివేయించి, ఆ పనులు తనతో చేయిస్తూ పని మనిషి కంటే హీనంగా చూసినా సహించానని తెలిపారు. డబ్బు, అధికార బలంతో తనకు అన్యాయం చేసినా దేవుడి ముందు మాత్రం వాళ్లు తప్పించుకోలేరన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దేవికా చౌదరి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.