ఉన్మాదం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు | Man Slits Young Woman Throat In Nellore District | Sakshi
Sakshi News home page

ఉన్మాదం: ప్రేమించలేదని యువతి గొంతు కోసిన యువకుడు

Mar 21 2022 9:50 AM | Updated on Mar 21 2022 2:41 PM

Man Slits Young Woman Throat In Nellore District - Sakshi

వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.

సాక్షి, నెల్లూరు: వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటర్ విద్యార్థి చిగురుపాటి జ్యోతికను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. ప్రేమించిన యువతి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో

పాత బకాయి అడిగినందుకు...
అనుమసముద్రంపేట: మద్యం మత్తులో తనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడని హసనాపురానికి చెందిన సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాషిణి హసనాపురం సెంటర్‌లో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకుని కూల్‌డ్రింక్స్‌ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం శ్రీకొలనుకు చెందిన గడ్డం విజయ్‌కుమార్‌ మరో ముగ్గురితో కలిసి మద్యం సేవించేందుకు కూల్‌డ్రింక్‌ షాపు వద్దకు రాగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పాత బకాయి సైతం చెల్లించాలని కోరడంతో ఇద్దరి నడుమ వాగి్వవాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విజయ్‌కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్‌పేట పోలీసులు కేసు విచారణ చేపడుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement