
సాక్షి, నెల్లూరు: జిల్లాలో మహిళలు, చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వెంకటగిరి మండలం జీకే పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వీరంతా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అదృశ్యమైన ఐదుగురి జాడను కనుక్కునేందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.(చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. )
Comments
Please login to add a commentAdd a comment