
సాక్షి, తిరుపతి: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి మర్రిగుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటగిరి జెడ్పీటీసీ, వైఎస్సార్‌సీపీ నాయకులు కోలా వెంకటేశ్వర్లు(45) మృతి చెందారు. ఆయన కారు ఇనుప లోడు లారీని ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు తిరుపతి నుంచి వెంకటగిరి వెళ్తుండగా రేణిగుంట యోగానంద కాలేజి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అదే కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాజుల మండ్యం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం