మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా కాకుండా కన్నతండ్రిలా పరిపాలించారని ఆయన కుమార్తె షర్మిల తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు.... రైతులకు మేలు చేసేందుకు రాజన్న అనుక్షణం తపించేవారని అన్నారు. రైతులకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ముఖ్యమంత్రి పదవి చేపట్టి న వెంటనే అందుకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడ్డారని ఈ సందర్భంగా గుర్తు షర్మిలాచేశారు. పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఫీజు రియెంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.అలాగే పేదవాడు పెద్దాసుపత్రుల్లో వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారన్నారు.
రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి కాని రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర మాత్రం పెరగలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసమర్ధ కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడేందుకు తమ పార్టీ శాసన సభలో అవిశ్వాసం తీర్మానం పెడితే... ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాపాడారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రజలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబు... ఇప్పుడు అధికారంల కోసం సంక్షేమ పథకాలంటూ కొత్త పల్లవి అందుకున్నారని షర్మిల ఈ సందర్భంగా చంద్రబాబును ఎద్దేవా చేశారు. గోప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి అని విమర్శించారు. అఖరికి చార్మినార్ కూడా నేనే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎన్ని పార్టీలు ప్రలోభపెట్టిన ఓటు వేసే ముందు ఒక్కసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాని వెంకటగిరి ప్రజలకు షర్మిలా హితవు పలికారు.