సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. కులమతాలకతీతంగా మహానేతకు నివాళులర్పించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి స్థానికులకు మిఠాయిలు, రోగులకు పండ్లు పంచిపెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పేదలకు అన్నదానం చేశారు. కోవూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పాలనలో ప్రవేశపెట్టిన పథకాల గురించి కొనియాడారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ గాంధీబొమ్మ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కరెంట్ ఆఫీసు సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి గూడూరులో జరిగిన జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొని మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గూడూరులో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్ జయంతిని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు, పేదలకు దుస్తులు అందజేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు, మర్రిపాడు, చేజర్ల, సంగం, ఏఎస్‌పేట, సోమశిల మండలాల్లో వైఎస్సార్ జయంతిని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
వైఎస్‌ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు. కొండాపురం, దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాల్లో వైఎస్ జయంతిని నిర్వహించారు. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవ య్య పాల్గొన్నారు.
వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. కావలి పట్టణం, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు మహానేత విగ్రహాలకు పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కావలిలోని ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
చిరస్మరణీయుడు వైఎస్సార్
Published Thu, Jul 9 2015 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement