పోలేరమ్మజాతరలో డ్రోన్ నిఘా
వెంకటగిరి : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ఈ ఏడాది డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకష్ణ తెలిపారు. జాతర ఏర్పాట్లకు సంబంధించి ఆయన నివాసంలో మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పాలకేంద్రం సెంటర్, క్రాస్‌రోడ్డు, కాశీపేట, కాంపాళెం, పాతబస్టాండ్, పోలేరమ్మ ఆర్చి, ఆర్టీసీ బస్టాండ్ తదితర 16 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జాతరలో వీఐపీ పాస్‌ల విధానం రద్దు చేస్తామని తెలిపారు. రాజాల సారెతీసుకొచ్చే సమయంలో 15 మందికి మించి వస్తే అనుమతించమన్నారు. అంతకుముందు సూళ్లూరుపేట సీఐ విజయకష్ణ, ఎస్సై రహీమ్‌రెడ్డిలు జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లలో భాగంగా ముందస్తుగా బందోబస్తు నిర్వహణ, భక్తులకు దర్శన ఏర్పాట్లలో అసౌకర్యాలు కలగకుండా చేపట్టాల్సిన చర్యలను స్థానిక పోలీస్ అధికారులతో చర్చించామన్నారు.