- రుణాల పేరుతో దండకాలు
- లబ్ధిదారులతో బేరసారాలు
- వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ అధికార పార్టీ కౌన్సిలర్ సంభాషణ
- మసకబారుతున్న అధికార పార్టీ ప్రతిష్ట
వసూల్ రాజాలు
Published Tue, Aug 23 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాలిటీలో అధికారపార్టీ కౌన్సిలర్లు వసూల్ రాజాలుగా మారుతున్నారు. రుణాల పేరుతో దండకాలు సాగిస్తున్నారు. రుణం మంజూరు చేయిసే మాకేంటి అంటూ లబ్ధిదారులతో బేరసారాలకు దిగుతున్నారు. వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ కౌన్సిలర్ బేరసారాల సంభాషణ పట్టణంలో సోమవారం చర్చనీయాంశంగా మారింది. సంభాషణ విన్న పలువురు మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధులు ఇలా మారిపోయారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండా మోసినందుకు ప్రభుత్వ పథకాలు లబ్ధిపొందవచ్చుని భావించిన పేదల ఆశలు కౌన్సిలర్ల వైఖరితో అడియాసలు అవుతున్నాయి. ఇటీవల పట్టణానికి చెందిన ఓ కౌన్సిలర్ ఎస్సీ సబ్సిడీ రుణాన్ని పొందిన లబ్ధిదారుడుతో బేరం పెట్టాడు. ఫో¯Œæలో జరిగిన ఈ సంభాషణ వాట్సప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సంభాషణలో సదరు కౌన్సిలర్ మరో వార్డు కౌన్సిలర్ కూడా ఎస్సీ సబ్సిడీ రుణం కోసం రూ.20వేలు వసూలు చేస్తున్నట్లు పేర్కొనడంతో అధికార పార్టీ కౌన్సిలర్ల తీరుపై పట్టణ ప్రజల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకెంత మంది టీడీపీ కౌన్సిలర్లు వసూల్ రాజాలుగా వ్యవహరిస్తున్నారోనన్న ^è ర్చ జోరుగా సాగుతుంది. వెంకటగిరి మున్సిపాలిటీగా ఏర్పడినప్పటì æనుంచి ఎన్నడూ లేని విధంగా ఏకపక్షంగా పట్టణ ప్రజలు 25 వార్డులకు గానూ 21 వార్డులను టీడీపీకి కట్టబెట్టారు. అయితే పట్టణ ప్రజల ఆశలను పలువురు టీడీపీ కౌన్సిలర్లు అడియాశలు చేస్తున్నారు.
మసకబారుతున్న అధికార పార్టీ ప్రతిష్ట
వెంకటగిరి మున్సిపాలిటీలో అధికార పార్టీ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారుతోంది. ఈ నెల 11న వృద్ధాప్య పింఛన్లను టీడీపీ నాయకులు స్వాహా చేసిన వ్యవహారం కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి వెళ్లగా, బాధ్యులుగా బిల్‌కలెక్టర్ వెంకటేశ్వర్లు, మురళిను సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరచిపోక ముందే రుణాల బేరసారాల వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
వర్గపోరుతో వెలుగులోకి ..
మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్ల మధ్యన నడుస్తున్న వర్గపోరుతో పలు కుంభకోణాలు, బేరసారాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి మున్సిపల్ సమావేశాల్లో స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తున్నారు. గత నెల రోజులుగా∙ఇరువర్గాలకు చెందిన కౌన్సిలర్లు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఓ వర్గానికి చెందిన కౌన్సిలర్లను లక్ష్యంగా చేసుకుని మరో వర్గం పింఛన్ల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి రుణాల బేరసారాల సంభాషణను వాట్సప్‌లో పెట్టి చర్చకు తెరలేపారు. దీంతో వైరివర్గం కౌన్సిలర్లు సైతం మరోవర్గాన్ని దెబ్బతీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆ వర్గానికి చెందిన కౌన్సిలర్లు చనిపోయిన వృద్ధుల పింఛన్ల స్వాహతో పాటు మరికొన్ని అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నెలాఖరులో జరగబోయే కౌన్సిల్ సమావేశాన్ని వేదకగా చేసుకుని తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement