యాచేంద్రను కలిసి సంఘీభావం తెలియజేసిన స్థానికులు
సాక్షి, వెంకటగిరి: అధికార టీడీపీలో వివక్షకు గురై ధిక్కార స్వరం వినిపించిన రాజా కుటుంబీకులకు పట్టణంలోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదివారం స్థానిక రాజా ప్యాలెస్‌లో రాజా కుటుంబీకుడు సర్వజ్ఞ కుమార యాచేంద్రను పట్టణంలోని పలువురు కలిసి సంఘీభావం తెలిపారు. స్థానికులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ పటిష్టతకు కృషి చేసిన రాజా కుటుంబీకులను పార్టీ అధిష్టానంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కె.రామకృష్ణ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేయడంతో ఆ పార్టీపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయంగా రాజాలు తీసుకునే నిర్ణయానికి తాము మద్దతుగా ఉంటామని పలువురు సంఘీభావం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment